Home » బొద్దుగా ఉన్నవాళ్లు చీర కట్టుకున్నప్పుడు ఈ 7 టిప్స్ పాటిస్తే చాల క్యూట్ గా కనిపిస్తారు

బొద్దుగా ఉన్నవాళ్లు చీర కట్టుకున్నప్పుడు ఈ 7 టిప్స్ పాటిస్తే చాల క్యూట్ గా కనిపిస్తారు

by Nikitha Kavali
0 comment
106

అమ్మాయిలు  చీరలో చాల అందంగా కనిపిస్తారు అది ఎవరు కట్టిన సరే. సన్నగా ఉన్న బొద్దుగా ఉన్న ఎలా ఉన్న ఆ చీర కట్టులో ఉండే అందమే వేరు. మరి ఈ చీర కట్టులో ఒక్కొక్కరి శరీర ఆకృతి ని బట్టి వాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంకా అందంగా కనిపిస్తారు. ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు చీర కొనేటప్పుడు, కట్టుకునేప్పుడు ఈ టిప్స్ పాటిస్తే ఎంతో అందంగా కనిపిస్తారు.

  1. బొద్దుగా ఉన్న వాళ్ళు చీరలు కొనే అప్పుడే లైట్ కలర్స్ కాకుండా కొంచెం డార్క్ గా ఉన్న కలర్స్ ను ఎంపిక చేసుకోండి. నేవీ బ్లూ, ముదురు ఉదా రంగు (డార్క్ పర్పుల్), నలుపు, ముదురు ఆకు పచ్చ లాంటి రంగులున్న చీరలను ఎంపిక చేసుకోండి. ఈ డార్క్ రంగు చీరల్లో మీ శరీర ఆకృతి కొంచెం నాజూకు గా కనిపిస్తుంది.
  1. ఇక చీర యొక్క ఫాబ్రిక్ దగ్గరికి వస్తే కాటన్, సిల్క్ చీరలను దూరం పెట్టండి. ఈ కాటన్ మరియు సిల్క్ మీరు ఇంకా లావుగా కనపడేలా చేస్తాయి. అందుకని నెటెడ్(Neted), షిఫ్ఫోన్(Shiffon), జార్జెట్ట్(Georgette) చీరలను ఎంపిక చేసుకోండి.
  1. ఇంకా పెద్ద అంచు ఉన్న చీరలు, ఎక్కువగా డిజైన్ ఉన్న చీరలను కట్టుకోవద్దు, ఆలా చేస్తే మీరు ఇంకా లావుగా కనిపిస్తారు. డిజైన్ తక్కువ ఉన్న చీరలు, లేదా ప్లైన్(plain) గా ఉన్న చీరలను కట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
  1. జాకెట్ ను స్లీవ్ లెస్ కాకుండా హాఫ్ స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ వేసుకోండి. ఒకవేళ ఫుల్ స్లీవ్స్ అయితే నెట్టెడ్ వి పెట్టించుకోండి.
  1. అలాగే చీర మీద అడ్డ గీతాలు ఉన్న డిజైన్ ఉంటె దానిని అసలు వేసుకోవద్దు. నిలువు గీతాలు డిజైన్ ఉన్న చీరలను ఎంపిక చేసుకోండి.
  1. మీ జాకెట్ షేప్ కూడా వీ-షేప్ నెక్ (v-neck), స్వీట్ హార్ట్ షేప్, బోట్ నెక్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ విధమైన మోడల్స్ లో  మీరు జాకెట్ ను కొట్టించుకోవడం వలన మీ శరీరం కొంచెం నాజూకుగా కనిపిస్తుంది. 
  1.  ఇక మీరు చీర కట్టుకున్నప్పుడు సాధారణ పెట్టీకోట్ లను కాకుండా షేప్ వేర్ ను ధరించండి. షేప్ వేర్ మీ శరీర ఆకృతిని సన్నగా కనపడేలా చేస్తుంది.

ఈ టిప్స్ను కచ్చితంగా పాటించండి మీరు ఎప్పుడూకన్నా చాల అందంగా కనిపిస్తారు. బొద్దుగా ఉన్న స్నేహితురాళ్లకు ఇది షేర్ చేయండి.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version