అన్నా నీకోసం (Anna Neekosam) లిరిక్స్ | Ganu | Bullet Bandi Laxman

by Lakshmi Guradasi

పల్లవి ;~

దండానికీ పిండేసినా అన్నా నీ అంగీ
ఇంకా ఎండనే లేదురా
నీ పెండ్లికీ పెట్టుకున్నా ఎర్రని పారని
ఇంకా పోనేలేదురా
వదినమ్మా మెడలా నువ్వేసినా ముడూ ముళ్ళురా
మూడు రోజులు గాకముందే ఊరితాడైయిందిరా

తెల్లారనే తెల్లారిందిరా కొడుకా
నువు లేక ఇల్లు చీకటైందిరా
కన్నపేగు కమిలిపోయిందిరా కొడుకా
తొడవుట్టిన తమ్ముడు ఒక్కోడే అయ్యిండురా
తొడవుట్టిన తమ్ముడు.. ఒక్కోడే అయ్యిండురా

చరణం 1;~

అన్నా నీకూ నేనే నాన్ననైనరా
ఊరంతా మెచ్చేటట్టు నీ పెళ్లే చేసినరా
అన్నా నీకోసం ఒక ఇల్లే గడుతరా
అని దాసుకున్న పైసలన్ని నీకే వేడితిరా
ఇంతలోనే అన్నా ఇంతలోనే అన్నా

ఆ గంగోడ్డుకే బోందతోడుకొని అన్నా
ఇగ ఇదే నాకు ఇల్లు అన్నవారా అన్నా
నీ పెయినిండా సలివెడుతుందాని అన్నా
పండుకున్నవారా మన్ను మీదవోసుకొని

చరణం 2:-

మీచిన్నప్పుడే మీబాపు సచ్చిపోతే నా కొడుకా
పిల్లల కోడిలెక్కల మిమ్ముల సాదుకున్నరా
సన్నపు బియ్యం బువ్వని మీకు పెట్టినరాకొడకా
నేను కంట్రోలు బియ్యం కారంతో తిని పండూకున్నరా

పేగు తెంచుకొని పెంచుకున్నరా కొడుకా
పెంచిన పేరు నాకూ వుంచకపోతివిరా
మీ బాపు నిన్నూ పిలుసుకున్నడా కొడుకా
నన్ను కూడా నీతోని కొంటవోవురా…….

చరణం 3 ;~

రోజంతా తిరిగి తిరిగి ఇంటికచ్చి నాకొడకా
ఆకలైతుందే అవ్వా అని అంటే నా కొడుకా
ఉడుకుడుకు బువ్వే నీకే అండిపెట్టినరా కొడుకా
నువ్వు కడుపునిండా తింటే నా కడుపే నిండిందిరా

అవ్వా అని అలుగలేవురా కొడుకా
బువ్వ ఏయ్యే అని బుదిరికియ్యురా
ఇరువయేండ్ల జ్ఞాపకాలురా కొడుకా
కండ్లల్లకెళ్ళి పోతలేవురా
కండ్లల్లకెళ్ళి పోతలేవురా

చరణం 4;~

నువ్వు దూరాదేశం దూబాయికి పోతే నాకొడకా
ఒక్క ఏడాదికో రెండేండ్లకో అత్తడు అనుకున్నరా
నువ్వు తాగీ ఏడన్న పడి పోను లేపకపొతేరా
కనిపిచ్చినోళ్ళని నాకొడుకు ఏడని అడిగేదాన్నిరా

ఇప్పుడెప్పుడద్దూవనుకుందురా కొడుకా
ఏ తోవ్వల నీ జాడ ఎవల్ని అడగాలేరా
ఆ దేవునిమీదా మన్నువోయ్యరా కొడుకా
అన్నీ తెలిసే పాపపు రాతని రాసిండురా

చరణం 5;~

అచ్చే జన్మల అన్నా నీకూ అన్నై పూడుతరా
ఆ జన్మల నీకంటే ముందే నేను సచ్చిపోతరా
అన్న నువ్వేలేకా ఇన్నాళ్లు నేను పడ్డా బాధనీ
సచ్చేదాకా సచ్చిపోని బాధను ఇచ్చిపోతరా
నీకు ఇచ్చిపోతరా

ఆరుగురు అన్నలల్లరా అన్నా
ఒకతే ఒక్క సెల్ల ఉందిరా
అది రాఖి గట్ట అచ్చినప్పుడూ
అన్నా అన్నేడీ అంటే ఏమి చెప్పుడు

చరణం 6;~

నీ భూజం మీద ఆడిననన్నూ అన్నా
నా భూజం మీద మోయ్యుమంటావా
నిను సాదుకున్న చేతులతోనీ కొడుకా
నీ మీద మన్ను పోయ్యుమంటవా….
నీ మీద మన్ను పోయ్యుమంటవా…

ఉకుకెనే మీది మీదికచ్చి కొట్టొటోన్నిరా
నిన్నేవాడేమన్న ఈ అన్నా గల్లావత్తెటోడురా
ఉకుకెనే ఉత్తా మాటలతో నిన్ను తిట్టేటోన్నిరా
నా తమ్ముడు హీరోరా అని ఊరంత చెప్పేటోన్నిరా

అమ్మనేడిపియ్యవోకురా తమ్ముడా
అన్న లేడని నువు సిన్నబోకురా
ఇంకొక్క జన్మ నాకు ఉంటేరా తమ్ముడా
నీ కడుపున కొడుకయ్యి పుడుతరా

____________________

Song Credits:

సాంగ్ : అన్నా నీకోసం (Anna Neekosam)
సాహిత్యం, గాయకుడు, నటుడు – గను (Ganu)
నిర్మాత – జాడి లక్ష్మి (Jadi Laxmi)
దర్శకుడు – ప్రమోద్ నాని (Pramod Nani)
సంగీత దర్శకుడు – మదీన్ Sk (Madeen Sk)
గాయకులు – శ్రీనిధి (Srinidhi), బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman) & గను (Ganu)
నటీనటులు – గను (Ganu), చిన్ను గాడు (Chinnu gadu), నందిని జాదవ్ (Nandini Jadav), రాధిక (Radhika)

See Also plz click on this: oorantha-suttale-ne-pelliki-song-lyrics-love-failure

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like