దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఇది ఎందరో మహనీయుల త్యాగం ఫలితంగా 1947 ఆగష్టు 15న నిర్మించారు. స్వాతంత్రోధ్యమ చిహ్నమే ఈ గడియార స్థంభం. బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయులు విముక్తి పొందిన రోజున ఈ గడియార స్తంభాన్ని నిర్మించారు. 1945 లోనే కాబినెట్ మినిస్టర్ భరత్ లో పర్యటించినప్పుడు అనంతపురం లో కూడా పర్యటించినట్లు చరిత్ర చెబుతుంది.
1945 లోనే జిల్లాలోనే ప్రజలు దదాపు 30వేల రూపాయలు వసులు చేసారు. ఆ నిధులతోనే దీనిని నిర్మించారు. క్లోక్ టవర్ కు రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేసారు. ఒకదాంట్లో ప్రారంభోత్సవ వివరాలు, మరో శిలాఫలకం పై విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రాసి ఉన్నాయి. అప్పటి జిల్లా జడ్జి శ్రీ. ఎం. రామచంద్ర నాయుడు అధ్యక్షతను ఈ స్మారక చిహ్నాల నిర్మాణానికి బడ్జెట్ పై చర్చించేందుకు సభ కమిటి ని ఎన్నుకున్నారు.
అలాగే 1947 ఆగష్టు 15న అనంతపురం లోని పాతబస్తీ పార్కులో గాంధీ కాంస్య విగ్రహాన్ని క్లోక్ టవర్ నిర్మాణానికి జిల్లా జడ్జి రామచంద్ర రావు శంకుస్థాపన చేసారు.
1947వ సంవత్సరం లో అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ గా రాజనాల కోటేశ్వరరావు పనిచేస్తున్న సందర్భం లో వారి చేతుల మీదుగా ఈ టవర్ క్లోక్ ను ప్రారంభించారని ఇక్కడ శిలాఫలకం ద్వారా తెలుస్తుంది.
నాలుగు ముఖాలు కనిపిస్తున్న అష్ట భుజాలతో 47 అడుగుల వెడల్పుతో దీన్నీ నిర్మించారు. 15 అడుగుల వెడల్పు 15వ తేదీని, అష్ట భుజాలు 8వ నేలను 47 అడుగుల ఎత్తు 1947వ సంవత్సరాన్ని స్ఫూర్తిన్చేలా దీన్ని నిర్మించడం విశేషం.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను సందర్శించండి.