Anaga Anaga Kathala Song Lyrics Tribanadhari Barbarik
చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలే
అనుంబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలే
చిరునవ్వై విరిసెలే మనసంతా మురిసెలే
అల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే..
అనగా అనగా కథలా మొదలైనదిలే మరలా
ఎప్పుడో తనువే విడిన బాల్యమిలా
మనసే ఎగసే అలలా వయసే ఊరికే నదిలా
ఎనభై ఎగిరీ దుమికే పాతికలా
పసితనమే రాలేక బదులుగా నిను పంపిందా
ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగా
అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నా
నాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నా
నువ్వే నా ప్రాణంకన్నా ఎక్కువ అంటున్నా
నిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా
లాలే పోస్తా నీకే జడలే వేస్తా
నింగిలో చుక్కలే నీ తలకి పూలల్లుతా
వానై వస్తా నిన్నే గొడుగై కాస్తా
పడవలే వదులుతూ నీతోటి చిందడుతా
కంటికే రెప్పల కాయనా కాపలా
నిదురనైన నిన్ను వీడిపోక వస్తా నీ కలలా
చిరు ప్రాయం కుసుమాలే వీడిపోని హృదయాలే
అనుంబంధం పెనవేసే పసిప్రేమై కలిసేలే
చిరునవ్వై విరిసెలే మనసంతా మురిసెలే
అల్లరులే స్నేహాలై సందడిగా మరెనులే..
అనగా అనగా కథలా మొదలైనదిలే మరలా
ఎప్పుడో తనువే విడిన బాల్యమిలా
మనసే ఎగసే అలలా వయసే ఊరికే నదిలా
ఎనభై ఎగిరీ దుమికే పాతికలా
పసితనమే రాలేక బదులుగా నిను పంపిందా
ఈ తాతని మార్చేలా ముడతల బుడతడిగా
అమ్మై ప్రేమందిస్తానే అమ్మని కాకున్నా
నాన్నై నిను నడిపించేందుకు తాతని నేనున్నా
నువ్వే నా ప్రాణంకన్నా ఎక్కువ అంటున్నా
నిన్నే నా ప్రాణం పోనీ విడువను క్షణమైనా
Song Credits:
పాట పేరు : అనగ అనగ కథల (Anaga Anaga Kathala)
చిత్రం : త్రిబనాధారి బార్బారిక్ (Tribanadhari Barbarik)
సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్ (Infusion Band)
సాహిత్యం: సనారె (Sanare)
గానం: కార్తీక్ (Karthik)
నటీనటులు: సత్య రాజ్ (Satya Raj), సత్యం రాజేష్ (Satyam Rajesh), వశిష్ట (Vasishta)
రచన & దర్శకత్వం: మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa)
నిర్మాత: విజయపాల్ రెడ్డి ఆదిదల (Vijaypal Reddy Adidhala)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.