గసగసాలను రోజూ తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు గర్భం ధరించడం సులభం చేస్తుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తింటే ఉపశమనం ఉంటుంది. తెల్లటి ఆవగింజల్లా ఉండే గసగసాలు ఆహారంలో చేర్చుకుంటే చాలా లాభాలుంటాయి. చాలా రకాల గ్రేవీ కూరల్లో కూడా గసగసాలను మిక్సీ పట్టి వేస్తారు. దీంతో కూరలకు రుచితో పాటూ చిక్కదనమూ వస్తుంది. అంతేకాకుండా బాలింతలకు గసగసాలను మిక్సీ పట్టి పొడితో కూర చేసి కూడా ఇస్తారు. దీంతో పాలు పడతాయని చెబుతారు. దీనితో పాటే గసగసాలను తినడం వల్ల అనేక లాభాలున్నాయి. అవేంటో చూడండి.
గసగసాలను ఎలా ఆహారంలో చేర్చుకోవాలి?
గసగసాలతో రుచికరమైన చట్నీ చేసుకొని తినవచ్చు. లేదైనా ఏవైనా పచ్చళ్లలో కూడా వీటిని వేసుకోవచ్చు. గ్రేవీ కర్రీలలో గసగసాలను పొడిగా చేసి వేయొచ్చు. మీల్ మేకర్, టమాటా లాంటి కూరల్లో గసగసాల పొడి మరింత రుచి పెంచుతుంది. గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది. అలాగే కాస్త గసగసాల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.
గసగసాలను పొడిగా చేసి పటిక బెల్లంతో కలిపి తినవచ్చు. టమాటా, వెల్లుల్లితో చేసిన తాలింపులో కాస్త బరకగా మిక్సీ పట్టిన గసగసాలు వేసి కూర చేసుకోవచ్చు.
గసగసాల వల్ల ప్రయోజనాలు: గసగసాలను రోజూ ఆహారంలో తింటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్దకం లాంటి సమస్యలు దూరం చేస్తుంది. దీనివల్ల ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ సమస్య కూడా తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత లేదా ఏదైనా హెవీ ఫుడ్ తిన్న తర్వాత, పానీయాలు తాగిన తర్వాత పొట్ట నిండుగా కడుపు నొప్పిగా అనిపించే వాళ్లు,వెంటనే మల విసర్జణకు వెళ్లాల్సి వస్తోంది అనిపించినప్పుడు గసగసాలు తినొచ్చు. ఈ సమస్య కాస్త గసగసాలు తగ్గిస్తాయి.
గసగసాలలో గుండెను ఆరోగ్యంగా ఉంచే అన్ని ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. వీటిని రోజూ తింటే గుండె ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం, జుట్టుకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల గసగసాలు తినడం వల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది. గసగసాలు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి పనిచేస్తాయి.
ఎముకలలో కాల్షియం లోపం ఉన్నవారు. గసగసాలు వీరికి మేలు చేస్తాయి. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఈ లోపాన్ని తొలగిస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది. సంతానోత్పత్తి సమస్యలు ఉన్న మహిళలకు జింక్, కాల్షియం మరియు ఐరన్ ఎక్కువగా అవసరం. అటువంటి పరిస్థితిలో, గసగసాలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
డెలివరీ తర్వాత బాలింతలు అన్ని రకాలు ఆహారాలు తినలేరు. పిల్లలకు పాలు ఎక్కువగా వచ్చేలా వాళ్ల ఆహార శైలి ఉంటుంది. అందుకే ఈ సమయంలో గసగసాలతో చేసిన కూర చాలా చోట్ల ఇస్తారు. దీంతో పోషకాలు అందడంతో పాటూ పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెబుతారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.