సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి మొటిమలు అనేవి వస్తు నే ఉంటాయి. అవి మన మొఖం మీద చూడటానికి అంతగా బాగుండవు. మొటిమలు రావడం అనేది మనలో ఉన్న హార్మోన్స్, తినే తిండి మీద ఆధార పడి ఉంటాయి. మన మొహం మీద ఒక్కో భాగం లో మొటిమలు వస్తూ ఉంటాయి దానికి మన జీవనశైలి లో జరిగే మార్పులే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
మన మొహం మీద ఏ ఏ భాగాలలో మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసుకోవడం చాల ముఖ్యం. అసలు ఆ మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే అవి రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ఒకవేళ మీకు కనుబొమ్మల దగ్గర ఎక్కువ మొటిమలు వస్తు ఉంటె మీ శరీరం లో నీరు శాతం తక్కువ అయినట్టు. లేదా మీరు వాడే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఏదైనా మీకు పడకుండా ఉన్నట్లయితే ఆ భాగం లో మొటిమలు వస్తాయి.
ఒకవేళ మీకు మొటిమలు నుదిటి భాగం లో వస్తూ ఉంటె; మీరు కొవ్వు శాతం ఉన్న ఆహారాన్ని, ప్రొసెస్డ్ ఫుడ్ ని ఎక్కువ గా తీసుకోవడం వల్ల మరియు సరిగ్గా నిద్రపోకపోవడం వళ్ళ నుదిటి పై మొటిమలు వస్తూ ఉంటాయి.
బుగ్గల మీద మొటిమలు వస్తున్నాయి అంటే మీరు మురికి గా ఉన్న దిండు కవర్లు లేదా దుమ్ము పట్టిన మేకప్ బ్రష్లను వాడటం వలను, మరియు ఎక్కువ గా పాల పదార్థాలు తినడం వల్ల కూడాను బుగ్గల మీద మొటిమలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
మీ శరీరం లో రక్త ప్రవాహం సరిగ్గా లేకున్నా, ఆహర జీర్ణం మెరుగ్గా లేకపోయినా, మంచి పోషక ఆహరం తీసుకోకపోయినా ముక్కు మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ మీకు గడ్డం, మూతి చుట్టూరు మొటిమలు వస్తు ఉంటె అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా స్ట్రెస్ వళ్ళనే రావచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
ఇక నుంచి అయినా మొటిమలు రాకుండా జాగ్రత్త పడండి. మీ జీవనశైలి లో కొన్ని మార్పులు చేర్చుకొని ఆరోగ్యాంగా, అందంగా జీవించండి.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.