Home » ఏ.పి.జె అబ్దుల్ కలాం జీవిత చరిత్ర

ఏ.పి.జె అబ్దుల్ కలాం జీవిత చరిత్ర

by Nithishma Vulli
0 comment

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం న్యూస్ పేపర్ బాయ్ లా పనిచేసి కష్టపడి చదివి ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారి మన దేశ స్పేస్ ప్రోగ్రాం అభివృధ్ధికి చాలా కృషి చేసారు. 2002 వ సంవత్సరంలో అధికార పార్టీ బీజేపీ మరియు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసు మద్దతుతో భారత 11 వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. కలాం తన జీవితంలో బ్రహ్మచారిగానే ఉన్నారు, కలాం ఎల్లప్పుడూ తన బంధువులతో సన్నిహితంగా ఉండేవారు.

కలాం తన జీవిత కాలంలో చాలా సాధారణంగా జీవించేవారు. రాత్రి 2 గంటలకు పడుకొని ఉదయం 7 గంటల సమయంలో లేచేవారు. కలాం ఎంత సాధారణంగా ఉండేవారంటె, తన వద్ద టీవీ కూడా ఉండేది కాదు. 27 జులై 2015 లో సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యాడు. షిల్లాంగ్‌ లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలామ్ హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలామ్ను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలామ్ కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కలాం చనిపోయిన తరవాత తన వద్ద మిగిలిన ఆస్తులు కొన్ని పుస్తకాలు, వీణ, సీడీ ప్లేయర్, లాప్టాప్ మాత్రమే.

కలాం గారి బాల్యం :

ఏ.పి.జె అబ్దుల్ కలాం 1931 వ సంవత్సరం అక్టోబర్ 15 న రామేశ్వరం లోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. కలాం తండ్రి పేరు జైనులబ్ధీన్ మరకయార్, తల్లి పేరు ఆషియమ్మ. కలాం చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం చాలా పేదరికానికి గురి అయ్యింది. తన కుటుంబ పరిస్థితి చూసి తన వంతు సహాయం చేయటానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారు.

కలాం గారు స్కూల్ లో చదివేటప్పుడు మార్కులు అంత ఎక్కువగా వచ్చేవి కావు కానీ కలాం గారికి కష్టపడి చదవటం మరియు నేర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది. ఈ పట్టుదల కలాం ని గంటల తరబడి చదివేలా చేసేది. కలాం ఎక్కువగా తన సమయం మాథెమెటిక్స్ నేర్చుకోవటం పై ఖర్చు చేసేవారు.

కలాం తన స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సెయింట్ జోసేఫ్స్ కాలేజీ, తిరుచిరప్పల్లి నుంచి కాలేజీ చదువులు పూర్తిచేసారు. యూనివర్సిటీ అఫ్ మద్రాస్ నుంచి 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసారు.

1955 లో మద్రాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవటానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో చేరారు. ఆ కాలేజీ లో చదివేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ విషయంలో కలాం గారు సరిగా ప్రాజెక్ట్ పై పనిచేయటం లేదని. 3 రోజుల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే కాలేజీ డీన్ స్కాలర్ షిప్ రద్దు చేస్తానని బెదిరించాడు. కలాం గారు కష్టపడి. ఇచ్చిన గడువులో ప్రాజెక్ట్ ను పూర్తి చేసి డీన్ యొక్క మెప్పు పొందారు.

ఇస్రో శాస్త్రవేత్తగా కలాం :

డిఫెన్సె రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO) లో కలాం చిన్న చిన్న హోవర్ క్రాఫ్ట్ ని నిర్మించడం మొదలు పెట్టారు. కానీ తనకు DRDO లో పని చేయటం అంతగా నచ్చేది కాదు.

1969 లో కలాం ISRO కు బదిలీ చేయబడ్డారు. కలాం మొట్ట మొదటి సాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా పనిచేసారు. తన నేతృత్వంలో రోహిణి సాటిలైట్ ను 1980 లో భూమి యొక్క కక్ష్యలో కి పంపడం జరిగింది.

కలాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) మరియు ఎస్‌ఎల్‌వి -3 (SLV-3) ప్రోజెక్టుల అభివృద్ధికి కూడా చాలా సహాయపడ్డారు. కలాం చేసిన ఈ కృషి వల్ల రెండు ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి.

కలాం ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ లకు కూడా డైరెక్టర్ గా ఉన్నారు. ఈ రెండు ప్రోజెక్టుల ముఖ్య లక్ష్యం బాలిస్టిక్ మిస్సైల్ అభివృద్ధి చేయటం. యూనియన్ కాబినెట్ ఈ రెండు ప్రాజెక్ట్ లకు నో చెప్పింది కానీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రహస్యంగా ఈ ప్రాజెక్ట్ కు నిధులు జారీ చేసింది.

తర్వాత కలాం యూనియన్ కేబినెట్ కు ఏరోస్పేస్ ప్రాజెక్ట్స్ ఎంత ముఖ్యమో ఎందుకు ఇండియా వీటిని అభివృద్ధి చేయాలన్న విషయం ఒప్పించడం లో కలాం కీలక పాత్ర పోషించారు.

ఇండియా ఒక్కొక్క మిస్సైల్ ను ప్రత్యేకంగా తయారుచేయకుండా ఒకేసారి పలు మిస్సైల్స్ తయారు చేయాలన్న ప్రతిపాదన అప్పటి డిఫెన్సు మినిస్టర్ ఆర్ .వెంకటరామన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కు ₹ 3.88 బిలియన్ కాబినెట్ ఇవ్వడం జరిగింది. కలాం మరియు ఇతర శాస్త్రవేత్తలు కలిసి ఈ ప్రాజెక్ట్ పై పనిచేసారు.

పోక్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ లో కలాం చాలా కీలక పాత్ర పోషించారు. ఇదే న్యూక్లియర్ టెస్ట్ పై బాలీవుడ్ లో పరమాణు అనే సినిమా కూడా తీసారు. మన ఆర్మీ కోసం అగ్ని,పృధ్వి, నాగ్, ఆకాశ్ త్రిశూల్ వంటి శక్తివంతమైన మిసైల్స్ తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు.

రాష్ట్రపతి గా కలాం:

2002 రాష్ట్రపతి ఎన్నికలలో కలాం భారత 11 వ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత ప్రధానిగా తన సేవలను అందించారు.

కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తి గా మెలిగారు ప్రజలు కూడా కలాం గారిని ఆధరించారు. కలాం భారత రత్న పురస్కారంతో కూడా సత్కరించబడ్డారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం 3 వ రాష్ట్రపతి.

20 జూన్ 2007 కి తన పదవి కాలం పూర్తి అయిన తర్వాత మళ్లీ రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు కానీ చివరి క్షణాలలో రద్దు చేసారు.

కలాం తన పదవి విరమణ తరువాత పలు కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు.

కలాం అందుకున్న పురస్కారాలు:

1981-పద్మ భూషణ్[భారత ప్రభుత్వం].

1990-పద్మ విభూషణ్[భారత ప్రభుత్వం].

1994-గౌరవనీయులైన ఫెలోగా [ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)].

1997-భారతరత్న[భారత ప్రభుత్వం].

1997-ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం[భారత జాతీయ కాంగ్రెస్].

1998-వీర్ సావర్కర్ పురస్కారం[భారత ప్రభుత్వం].

2000-రామానుజన్ పురస్కారం [ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై].

2007-సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ [వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK].

2007-కింగ్ చార్లెస్ పతకం[రాయల్ సొసైటీ, UK].

2008-ఇంజనీరింగ్ డాక్టర్[నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్].

2009-ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు[కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ].

2009-హూవర్ పతకం[ASME ఫౌండేషన్, USA].

2009-గౌరవ డాక్టరేట్[ఓక్లాండ్ విశ్వవిద్యాలయం].

2010-ఇంజనీరింగ్ డాక్టర్[వాటర్లూ విశ్వవిద్యాలయం].

2011-IEEE గౌరవ సభ్యత్వం[IEEE].

2012-గౌరవ డాక్టరేట్[సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం].

2014-సైన్స్ డాక్టరేట్[ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK].

రచనలు:

  • ఇండియా 2020 – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003).
  • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003).
  • ఇండియా-మై-డ్రీం – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ 2004.
  • ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ – ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004).

చివరి మాట:

రమేశ్వరం బస్తీ కుర్రోడుగా, ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా,భారత రాష్ట్రపతిగా ఆయన పోషించిన ప్రతి పాత్ర భారతీయులందరికి స్ఫూర్తిదాయకం. కలాం ఒక కర్మ యోగి,ఒక విజేత. అంతకు మించి ఆయన భరతమాత ముద్దుబిడ్డ. చివరిగా కలాం చెప్పిన ఒక గొప్ప మాటతో ముగ్గిద్దాం. “జీవితం నీకు విజయాలను అందించదు, అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తీ నీ చేతుల్లోనే ఉంటుంది”.

మరింత సమాచారం కోసం తెలుగు రీడర్స్ వెబ్సైటు ను సందర్శించండి.

You may also like

Leave a Comment