అతడు: దైవం దీవెనిచ్చే వరిపైరే కోతకొచ్చే
కన్నా కలలు తీరి నడిచీ ఇంటికొచ్చే
ఒక్కొక్క ఒడ్లగింజ బంగారు తల్లేరా
నమ్ముకున్న రైతుకష్టం నేలే ఎరుగునురా
ఆమె: మట్టితోటి మనిషిజన్మ ఏనాటి బంధవమ్మా
కట్టెలోన కాలేదాకా కాలం సాక్ష్యంవమ్మా
అతడు: రక్తంమంతా ధారబోస్తే రతనాల సీమా పండే…
హోయ్… ఓహొయ్
ఆమె: హైసా… హైసా …
అతడు: ఒయ్యారి గాజుల చప్పుడూ తన్నే నన్ననే పిల్లా తన్నే నన్ననే
అతడు: నన్ను నీ వైపు …
ఆమె: హైసా …
అతడు: నన్ను నీ వైపు వేళ్ళు వేళ్ళని నెట్టేస్తున్నవే తన్నే నన్ననే
ఆమె: హోయ్ తన్నే నన్ననే తన్నే నన్ననే
చుట్టూ పక్కలంతా మన చుట్టాలున్నారే
వాళ్లు చూస్తావున్నారే
నువ్వు నాతో చెప్పే ఊసే
చెంతకొచ్చి చెవ్వుల్లో చెబితే బాగుంటాదయ్యా
ఓ చిన్న మావయ్యా చిన్న మావయ్యా
అతడు: నువ్వు వరిచేనుకోస్తా ఉంటే
నా వయసేదో కుస్తావుందే
ఆమె: నువ్వు కూత ఆప్పిందెప్పుడు
నాకు నిదరెట్టిందెప్పుడు
అతడు: అట్టా ఊరు పోయినప్పుడే
మా మావ అనేదప్పుడే
ఆమె: నిజామా మావ …
అతడు: నిజమేనే …
మా అత్త మామ లా వేళాకోళం కూడా
ముచ్చటేలే
ఆమె: తన్నే నన్ననే తాన్నే నన్ననే
హోయ్ తన్నే నన్ననే తన్నే నన్ననే
ఓయ్ మావయ్యో .. బంగారం మెడతానాన్ని
చూపుల్లో అంటివే పెళ్లి చూపుల్లో అంటివే
తీరా మండేటి ఎండల్లోన మాడుస్తున్నవే
నన్ను మండేటి ఎండలోబెట్టి మాడుస్తున్నవే
అతడు: అది కాదే నా బంగారం
పూటకు ఒక్కసారి ఇలా దెప్పి పొడవకే
ఇట్టా దెప్పి పొడవకే
పండినా పంటాను కూడా బంగారమే అంటారే
నెత్తిమీద ఎట్టుకుంటే నువ్వు మెరిసిపోతవే
ఆమె: మోసుకుని పోతావుంటే మోపు మీద మోపు
ఎండపడి వస్తాడమ్మి మాయదారి మావ
అతడు: ఒక్కసారి అంత మోత కష్టమేగా నీకు.. హోయ్.. ఎహే
ఒక్కసారి అంత మోత కష్టమేగా నీకు
పడిపోతే కాలుజారి దిక్కు ఎవ్వరే నీకు
ఆ సీలు పొడే ఇట్ఠాతీసుకు రయ్యే
ఆమె: కుండతో పక్కనెట్టే వాళ్ళు పోయాక అంతా కలిసి తిందాం
సైడ్ ట్రాక్: తన్నే నన్ననే తానే తన్నేనన్ననే
తన్నే నన్ననే తానే తన్నే నన్ననే
ఆమె: పోద్ది పోతుంది ఇంకా చాలా పనుంది
ఎడ్లు కట్టలి కట్టి కుప్ప నూర్చాలి
పోద్ది పోతుంది ఇంకా చాలా పనుంది
ఎడ్లు కట్టలి కట్టి కుప్ప నూర్చాలి
సైడ్ ట్రాక్: తన్నే నన్ననే తానే తన్నేనన్ననే
తన్నే నన్ననే తానే తన్నేనన్ననే
ఆమె : తన్నే నన్ననే తన్నేనన్ననే
చుట్టూ పక్కలంతా మన చుట్టాలున్నారే
వాళ్లు చూస్తావున్నారే
నువ్వు నాతో చెప్పే ఊసే
చెంతకొచ్చి చెవ్వుల్లో చెబితే బాగుంటాదయ్యా
ఓ చిన్న మావయ్యా చిన్న మావయ్యా
___________________________________________________________
చిత్రం: తంగలన్ (Thangalaan)
పాట పేరు : పైరు కొత్త పాట (Pairu Kotha Paatta)
సాహిత్యం: బాస్కర్ బట్ల (Baskar Batla)
గానం: నారాయణన్ రవిశంకర్ (Narayanan Ravishankar), రమ్య బెహరా (Ramya Behara)
స్వరపరచినవారు : జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.