రాదే రాదే అలుపంటు రాదే
ఆడేస్తున్నా ప్రతి పూటే
వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే
అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి
మాటే వినదంటా వయసే
ఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
మా గుండె తిరిగేదాచోటే
అరెరే బాల్యం రమ్మన్న రాదే
గుర్తుకొస్తే కంట చెమ్మ
పెట్టిస్తుటుందే.. స్నేహాలే..
గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
సొంత ఊరిలో కన్న వారితో
ఉంటే వేరేలే మనసంతా హాయేలే
అంతా మారిన సాటి రావులే
అమ్మమ్మ ఇచ్చే వందకే
చెప్పాలంటే ఎంతున్నా లోనే
దాస్తం మా ప్రేమ
బైటే పెట్టే ధైర్యాలే లేవు లే
మాలో మాకే ఎన్నున్నా
చెయ్యి వేస్తే మా మీద
ఎవ్వర్నైనా తన్నేటి తీరులే
రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే
మౌనంగా ఆగిపోయే మనసే
మారిపోయేలే నేడు ఆ దారే
ఆ నాటి మాయే ఏమాయే
దేవుడు కనిపించి
ఏం కావాలి అంటే
మళ్ళి వెళ్తాం
మేమంతా చిన్న నాటికే
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
______________________________________________
చిత్రం: కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
పాట: ఆ రోజులు మళ్ళి రావు (Aa Rojulu Malli Raavu)
సంగీతం: అనుదీప్ దేవ్ (Anudeep Dev)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సాహిత్యం: కృష్ణకాంత్ (కె.కె)(Krishna Kanth (K.K))
నిర్మాణం: నిహారిక కొణిదెల (Niharika Konidela),
రచన & దర్శకత్వం: యదు వంశీ (Yadhu Vamsi)
ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్ (Committee Kurrollu Promotional Song) – కమిటీ కుర్రోళ్లు
ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
ప్రేమ గారడి (Prema Gaaradi) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.