ఏపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గారు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాడు . ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial Intelligence) హబ్ చేసేందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీ నెలకొల్పే అంశంపై చర్చించాడు . ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాడు. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ వంటి 16రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించవచ్చు ఏపి మంత్రి నారా లోకేష్. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీ (AI technology) ద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సూచించాను. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించాను. ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్ మెంట్ విసి అండ్ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు. అని ఏపి మంత్రి నారా లోకేష్ (Lokesh Nara) గారు x (twitter) పోస్ట్ చేశారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.