Home » లెగరా సాంబయ్య లెగరా సాంగ్ లిరిక్స్ – శివుడి పాట

లెగరా సాంబయ్య లెగరా సాంగ్ లిరిక్స్ – శివుడి పాట

by Lakshmi Guradasi
0 comment

సైడ్ ట్రాక్: పన్నిండు స్థంబాల పందిట్లో ఉయ్యాలా
పోడుకున్న సాంబయ్య లెగరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

యేడినీళ్ళు సానీళ్ళు ఏకము చేశాము
స్నానమాడంగా లెగరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

మల్లెలు మాలాలు నీకోసం తెచ్చాము
అలంకరించంగా లెగరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది
నాట్యమాడంగా లెగరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

ని భాష ఏందయ్యా ని యాస ఏందయ్యా
మా గోస నీకు సమాజయేది ఎట్ట శివయ్యా
కోరస్: మా గోస నీకు సమాజయేది ఎట్ట శివయ్యా

ని ఊరు ఏందయ్యా ని పేరు ఏందయ్యా
ఏ ఊరికెళ్లిన కండ్ల ముందు ఉంటావ్ శివయ్యా
కోరస్: ఏ ఊరికెళ్లిన కండ్ల ముందు ఉంటావ్ శివయ్యా

నిలువెళ్ళ కళ్ళతో ముల్లోకా పాలన
సళ్ళసల్లగా ఉంటది సామీ ని ఆలనా
ఏ విసుగులేక నసుగులేక
బరిస్తావు కన్నా తండ్రి లా ……

కంఠాన నల్ల నాగు ని కంట ప్రేమ వాగు
కోరస్: కంఠాన నల్ల నాగు ని కంట ప్రేమ వాగు

మేమ్ ని కన్నా పేగు మా ముందు కొంచం ఆగు
కోరస్: మేమ్ ని కన్నా పేగు మా ముందు కొంచం ఆగు

ని భాష ఏందయ్యా ని యాస ఏందయ్యా
మా గోస నీకు సమాజయేది ఎట్ట శివయ్యా
కోరస్: మా గోస నీకు సమాజయేది ఎట్ట శివయ్యా

సైడ్ ట్రాక్: పరమ శివుడని నేను యేడుకుంటే
పాములోడు అంటారు కదరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

గగనగంటుడని నేను అనుకుంటే
గంగిరెద్దుడు అంటారు అయ్యా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

కాశీనాధుడని నేను అనుకుంటే
కాటిలో పాడ్తావంటయ్యా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

సాములోరువాని నేను మొక్కుతువుంటే
సన్యాసీవి అంటారేందయ్యా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

గుణరూప రసగంధ స్పర్శ సమస్తము
విశ్వ నావిత్వం సామ్ ఆపేరేనా తత్వము
కోరస్: ఆపేరేనా తత్వము

సూరీడు చందురూడు అగ్గి నేత్రి నేత్రము
నేర్పినావు ఏ క్షణమున ఎట్టుండాలని సూత్రము
కోరస్: ఎట్టుండాలని సూత్రము

ధరించి తనువు మొత్తము భస్మాధారి భస్మము
కడల మిధులు బూడిదని చాటినావు సత్యము

భార్యకు ఇచ్చి సగదేహము తీర్చావు సందేహము
ఆలుమగలు ఒకేటేనాన్ని అందు అంతరార్ధము

అపురూపము ని రూపము అది జన దీపాము…
నిలాల బంగారు కొండా నిండవు గుండా నిండా
కోరస్: నిలాల బంగారు కొండా నిండవు గుండా నిండా

ఏ వించి ఇస్తావు అండా ని మాయ సల్లగుండా
కోరస్: ఏ వించి ఇస్తావు అండా ని మాయ సల్లగుండా

కంఠంలో దాచుకున్న కాలకూట ధారాళము
మంచి కొరకు కష్టాలనే దాటమని పాఠము
కోరస్: దాటమని పాఠము

నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగను
తలన ఉంచి తెలిపినావు మాకు జాలం విలువను
కోరస్: మాకు జాలం విలువను

ఆనందాలను సూచించే నంది ని వాహనం
ఆపదలకు జడవొద్దని నేర్పినది ఆభరణము

ఆ స్మశానమే ని విహార భూమి అయినా వైనము
అందరి అంతిమ యాత్ర అదే అన్న అర్ధము

సహనాలను సమకూర్చెను ని విబిన్నవం
ఏడు కండలు ఏలేటోడా ఎట్టు చూడ శంకరోడ
కోరస్: ఏడు కండలు ఏలేటోడా ఎట్టు చూడ శంకరోడ

శివ శబ్దంమైయి నిత్యం ఒద్దిగుండు గుండేకడా
కోరస్ : శివ శబ్దంమైయి నిత్యం ఒద్దిగుండు గుండేకడా

సైడ్ ట్రాక్: దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు
సక్కాని ఓ శంకరయ్యా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

ఒక్క పొద్దులుండి నిన్ను మొక్కినాము
సక్కదిద్దు మా బతుకు
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

ఉరకంగా ఉండలేక నిన్ను అడుగుతున్నాము
లోక ముచ్చటలు చెప్పు
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

శివుడజ్ఞా లేనిదే చీమైనా కుట్టదు
అంతా ని ఆట కదరా
లెగరా సాంబయ్య లెగరా
నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

________________________________________________

సాంగ్: లెగరా సాంబయ్య లెగరా
సంగీత సాహిత్యం: చరణ్ అర్జున్
గాయకులు: వీహ బిక్షమమ్మ, bvm శివ శంకర్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .

You may also like

Leave a Comment