69
తులసి ఆకులు:
- తులసి మొక్కలో క్యాన్సర్ పై పోరాడే ఔషధ ప్రభావం ఉన్నట్లు వరంగల్ నిట్ పరిశోధకులు గుర్తించారు. ఈ మొక్కలోని సూక్ష్మజీవుల నుంచి వచ్చే ఎల్. ఆస్పరాగస్, ఎల్ గ్లుటామినేస్ అనే ఎంజైమ్లతో అక్యూట్ లింఫో సిటిక్ లుకేమియా అనే ఔషధాన్ని రూపొందించిన పరిశోధకులు… మొదట దానిని ఎలుకలపై ప్రయోగించి, ఆ తర్వాత మనుషులపైనా పరీక్షించనున్నారు. దీనితో ఎలాంటి దుష్పలితాలు ఉండవని ప్రాథమిక పరీక్షల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు.
జామఆకులు:
కొన్ని జాము ఆకులను తీసుకొని నీళ్లలో వేసి వేడి చేయండి. ఆ నీటిని కనురెప్పల అంచున కాసేపు రాస్తే కళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది.
గోంగూరఆకులు:
- గోంగూరలో పోటాషయం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. దీని రక్తవల్ల ప్రసరణ మెరుగుపడుతుంది.
- రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
- విడమిన్ ఎ, బి1, బి2, బి9, సి ఎక్కువగా ఉంటుంది.
- విలువిన్ ఎ తో కంటి సమస్యలు, బి కాంప్లెక్స్ తో దంత సమస్యలు దూరమవుతాయి. ఎముకలు పటిష్టమవుతాయి.
- ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా ఉంటాయి. గుండె కిడ్నీ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.
గోధుమ గడ్డి రసం:
- గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెందుతాయి. దీనిలో B12, ఫోలిక్ ఆసిడ్, ఐరన్ పుష్కలంగా ఉంది ఎర్ర రక్తకణాలు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
- ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటరాదు. జీర్ణకోశంలోని కొలెస్టరాల్ ను ఇది కడిగేస్తుంది.
- ముఖ్యంగా క్యన్యర్ రోగులు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది.
కరివేపాకు ఆకులు:
- నిత్యం ఉదయాన్నే పరగడుపున10 కరివేపాకు ఆకులను తింటే బరువు తగ్గుతారు, డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
- కరివేపాకును కూరలు సూప్ లలో కలిపి తింటే శరీరానికి A, B, C, D, వంటి విటమిన్లు అందుతాయి .
- కరివేపాకు, జీలకర్ర పాలల్లో కలిపి తీసుకుంటి అజీర్ణ సమస్యలు దూరమవుతాయి.
- కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయి.
పాలకూర ఆకులు:
- బరువు తగ్గిస్తుంది కంటిచూపు మెరుగవుతుంది ఎసిడిటీని తగ్గిస్తుంది గాస్ట్రిక్, అల్సర్లను నివారిస్తుంది ఎముకలను బలంగా చేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కొత్తిమీర ఆకులు:
- హైబీపీ ఉన్న వారు కొత్తిమీరు సలాడ్ తీసుకోవాలి.
- దీని ఆకులూ వికారానికీ, అజీర్ణ సమస్యలకూ మంచి విరుగుడు.
- కొత్తమీర ఐ సైట్ షార్ప్ చేస్తుంది. కళ్లను కాపాడుతుంది.
- నోటి ద్వాసన పోగొడుతుంది. పుళ్లు రాకుండా అడ్డుకుంటుంది.
- ఎముకలను బలంగా, ఆరోగ్యంగా చేసే శక్తి కొత్తిమీరకుంది.
- ఆడవారిలో పిరియడ్స్ తిమ్మిర్లు తగ్గిస్తుంది.
- కూరలో వేసుకోవచ్చు, పచ్చిగా ఆకులు తినాచ్చు.
తోటకూర ఆకులు:
- తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి.
- విటమిన్ A, B, C, D, E, K, B12, B6 వంటివి తోటకూరలో ఉంటాయి.
- తోటకూర కొవ్వును తగ్గిస్తుంది.
- తోటకూరలో ఉండే పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది.
- సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలను తోటకూర అడ్డుకుంటుంది.
మునగాకు ఆకులు:
- విరేచనాలు, కడుపులో మంట, తలనొప్పి, నోటిపూత, కంటిచూపుకు దివౌంషధంగా పనిచేస్తుంది. వారంలో ఒకసారి లేదా రెండుసార్లు మునగాకును ఉపయోగించడం ద్వారా రక్తంతో పాటు కిడ్నీలను శుద్ధి చేసుకోవచ్చ.
మెంతికూర ఆకులు:
- మెంతికూర షుగర్ ను అదుపులో ఉంచుతుంది.
- చర్మ సంబంధిత రోగాలు రాకుండా ఇది కాపాడుతుంది.
- వారానికి రెండు లేదా మూడు సార్లు దీన్ని డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.