Home » అగర్బత్తి ధూప్ స్టిక్స్ తయారు ఇంట్లో

అగర్బత్తి ధూప్ స్టిక్స్ తయారు ఇంట్లో

by Shalini D
0 comment

రసాయనాలు లేని దూపం స్టిక్స్ ఇంట్లోనే తయారు చేసేయండి. ఇంట్లోనే దూపం స్టిక్స్ లేదా దూపం గిన్నెలు ఎలా తయారు చేసుకోవాలో తెల్సుకోండి. ఇదివరకు ఇంట్లో పండగలంటే సాంబ్రాణి నిప్పుల్లో వేసి ఇళ్లంతా పొగవేసేవారు. ఇప్పుడు ఆ కష్టం కూడా లేకుండా రెడీమేడ్ దూప్ స్టిక్స్ దొరుకుతున్నాయి. వాటిని వెలిగిస్తే అచ్చం సాంబ్రాణి వాసన, పొగ వస్తాయి. దూప్ స్టిక్స్ లేదా దూప్ కప్స్ తయారు చేయడానికి ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలు చాలు.

ఎండిపోయిన పువ్వుల రెక్కలు (మీరు పూజకు వాడిన పూల రెక్కలు తీసి ఆరబెట్టుకోవచ్చు లేదా వేరే పూల రెక్కలు వాడుకోవచ్చు), ఎండిన ఆవుపేడ, కర్పూరం, ఏదైనా ఎసెన్షియల్ నూనె, కొబ్బరి పీచు, ఎండిన తులసి విత్తనాలు లేదా బెరడు, కాస్త పత్తి అవసరం అవుతాయి.

వీటన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పొడి రెడీ అవుతుంది. ఈ పొడిలో కొద్దిగా తేనె, కాస్త స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలపాలి. మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి.

ఎండ ఎక్కువగా ఉంటే ఈ దూప్ గిన్నెల్ని ఎండలో ఒక్కరోజు పెడితే పూర్తిగా ఆరిపోతాయి. కానీ వర్షాకాలంలో వీటిని తయారుచేస్తే రెండు రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. వెలిగించే ముందు వీటిలో కర్పూరం, రెండు చుక్కల నెయ్యి వేసి వెలిగించుకుంటే చాలు. దూప్ గిన్నెలు రెడీ అయినట్లే.

వీటిని పూజా సమయంలో, ఉదయం లేదంటే సాయంత్రం పూట వెలిగిస్తే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా, ఆద్యాత్మికంగా అనిపిస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment