హాయ్ తెలుగు రీడర్స్! ఈ జలపాతం ఏంటి? రహస్యం ఏంటి? అనుకుంటున్నారా అవునాండోయ్ ఈ డెవిల్స్ కెటిల్ అనే జలపాతం నుంచి కిందకి పడిన నీరు మాయమయిపోతుందట, ఆ నీరు ఎక్కడికి వెళుతుందనేది ఇప్పటికీ తేల్చలేకున్నారు. అసలు విషయం లోకి వెలితే…
ఈ డెవిల్స్ కెటిల్ వాటర్ ఫాల్ మిన్నెసోటా(Minnesota) అనే ప్రాంతంలో వుంది. ఈ మినేసిట అనేది జెడ్జి సి ఆర్ మాగ్నే స్టేట్ పార్క్(Judge C.R. Magney State Park) అనే యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లొకేషన్ లో కెనడా సరిహద్దులో ఉంది. ఇక్కడ బ్రులే రివర్(Brule river) అనే ఒక నది ప్రవహిస్తుంటుంది. ఈ నదికి సంబంధించినదే డెవిల్ కెటిల్ జలపాతం. ఈ జలపాతంలో దాదాపు 800 అడుగుల ఎత్తు నుండి వాటర్ పడుతుంది. ఇలా పడిన నీరు 8 మైల్స్ దూరం వరకు ప్రవహిస్తుంది.
అయితే ఈ జలపాత రహస్యం ఏంటి అంటే, లేక్ సుపీరియర్(Lake Superior) అనే పెద్ద ఉప్పు నీటి సరస్సు నుండి బ్రులే రివర్(Brule river) అనే ఒక ఉప్పు నీటి నది ప్రవహిస్తుంది, ఈ ఉప్పు నీటి నది మీద ఈ జలపాతం ఏర్పడుతుంది. ఈ బ్రులే రివర్(Brule river) ఒకటిన్నర మైల్స్ ప్రవహించిన తరువాత రెండు పాయలుగా విడిపోయి జలపాతాలను ఏర్పరుస్తుంది. వీడిపోయిన రెండు పాయలలో ఒకటి ఈస్ట్ వైపు సాధారణంగానే ప్రవహిస్తుంది.
కానీ రెండవ పాయ నీరు మాత్రం ఒక కుండ లాంటి పెద్ద రంద్రం లోకి పడుతాయి. ఇలా పడిన నీరు బయటకు రాకుండా అలానే మాయమవుతాయి. ఇలా పడిన నీరు ఎక్కడికి వెళుతున్నాయి అనే విషయం తెలుసుకోవడానికి చాల మంది చాల రకాలుగా ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. మరికొందరు సాధారణ ప్రజలు ఈ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయం తెలుసుకోవడానికి పెద్ద పెద్ద వస్తువులు, కార్లను కూడా అందులో వేశారు, అవి కూడా ఆ నీటితో పాటు కనుమరుగైపోయాయి.
డెవిల్స్ కెటిల్ జలపాతం లొకేషన్(Devil’s Kettle Waterfall Exact Location):
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ స్టోరీస్ను సందర్శించండి.