Home » వాట్సాప్‌లో మెటా ఏఐ కొత్త ఫీచర్‌..

వాట్సాప్‌లో మెటా ఏఐ కొత్త ఫీచర్‌..

by Shalini D
0 comment

ప్రస్తుతం ఆర్టిఫిషియ్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. స్టార్టప్‌ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేశాయ్‌. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి.ఇందులో భాగంగానే మెటా కీలక అడుగు వేసింది. మెటా నేతృత్వంలో నడుస్తోన్న వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకొచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వాట్సాప్‌ యూజర్లు ఏఐ సేవలను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇంతకీ వాట్సాప్‌లో తీసుకొచ్చిన ఈ ఏఐ సేవలు ఏంటి.? ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే రౌండ్ షేప్‌లో ఉన్న ఒక ఐకాన్‌ కనిపిస్తోంది. ఆ సింబల్‌పై క్లిక్‌ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. దీంట్లో మీరు సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది.

అయితే ఈ ఫీచర్‌ ఇప్పటికే కొంత మందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్ మెటా తెలిపింది.

మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ సహాయంతో ఇకపై యూజర్లు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రత్యేకంగా యాప్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లోనే ఆ పని కూడా చేసేయొచ్చు. ఉదాహరణకు గూగుల్‌ సెర్చ్‌లో వెతికే ప్రతీ అంశం ఇకపై వాట్సాప్‌లోనే చెక్‌ చేసుకోవచ్చు.

రెస్టారెంట్స్‌ మొదలు సినిమా షోల వరకు అన్ని వివరాలు ఈ ఏఐ ఫీచర్‌ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని సేవలకే పరిమితమైన ఈ ఏఐ టూల్‌ను మరింత విస్తరించనున్నారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టెక్నాలజీ ను సందర్శించండి.

You may also like

Leave a Comment