Home » రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర రావడం లేదా ? అయితే మంచి నిద్ర కోసం…

రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర రావడం లేదా ? అయితే మంచి నిద్ర కోసం…

by Vinod G
273 views
tips for good sleep

హాయ్ తెలుగు రీడర్స్ ! బాగా నిద్ర పోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. మనకు ఎన్నో మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. దీని వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కానీ నిద్ర రాక చాల మంది ఇబ్బంది పడుతుంటారు. రాత్రి వేళ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు, ఒకవేళ పట్టినా మధ్యలోనే మేల్కొంటారు. ఇది మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు పాటిద్దాం..

  1. పసుపు కలిపిన పాలను తాగితే చక్కని ఆరోగ్యంతో పాటు మంచి నిద్రకూడా పడుతుంది.
    అందుకే నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగి చూడండి.
  2. బాదంపాలలో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి. నిద్రలేమితో బాధపడుతుంటే
    బాదం పాలు తాగవచ్చు.
  3. చెర్రీస్ లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది.
    నిద్రకు ఒక గంట ముందు చెర్రీ రసం తాగితే మంచిది.
  4. నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందే తేలికపాటి భోజనం చేయండి.
  5. రాత్రివేళ వేయించిన మసాలాతో కూడిన ఆహారపదార్ధాలు, ఐస్ క్రీమ్స్, టీ, కాఫీలను తీసుకోకపోవడం ఉత్తమం.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.