చలి కాలం లో మన చర్మం బాగా పొడిబారిబోతుంది. అది చర్మాన్ని చూడటానికి అంత బాగుండదు. ఇలా చలి కాలం లో మన చర్మం పొడిబారకుండా ఉండడానికి రాత్రి పూట ఈ చిన్న చిట్కాని ఫాలో అయితే చాలు. పొద్దున్న నిద్రలేచాక మీ మొహం బాగా మృదువుగా పొడిబారకుండా ఉంటుంది.
దీని కోసం 4 టీ స్పూన్ల పాలు, 1 టీ స్పూన్ అలోవేరా జెల్, 2 టీ స్పూన్ల తేనె కావాలి. ఈ మూడింటిని ఒక కప్ లోకి తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొహం మీద అప్లై చేసి 1 నిమిషం పాటు మసాజ్ చేయాలి తర్వాత దీనిని రాత్రంతా అలానే ఉంచేసి పొద్దున్న నిద్రలేచాక చన్నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే చలి కాలం మీకు పొడిబారిపోయిన చర్మం నుండి మీకు విముక్తి కలుగుతుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.