Home » స్వప్న వేణువేదో సాంగ్ లిరిక్స్ – రావోయి చందమామ

స్వప్న వేణువేదో సాంగ్ లిరిక్స్ – రావోయి చందమామ

by Vinod G
1.1K views
ravoyi chandamama

స్వప్న వేణువేదో సంగీత మాలపించే

సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

జోడైనా రెండు గుండెలా ఏక తాళమో

జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో

లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ

స్వప్న వేణువేదో సంగీత మాలపించే

సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం

ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే.. మల్లెలు నీకోసం

కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా

కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా

నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో…

ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో….

మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం

పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం

వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

స్వప్న వేణువేదో సంగీత మాలపించే

సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే

జోడైనా రెండు గుండెలా ఏక తాళమో

జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో

లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ

స్వప్న వేణువేదో సంగీత మాలపించే

సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే


చిత్రం: రావోయి చందమామ
సాహిత్యం: వేటూరి
సంగీతం: మణిశర్మ
గాయకులు: S P బాలు, చిత్ర
తారాగణం: నాగార్జున, అంజలి జవేరి

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.