pichhi premalo song lyrics alias rukmini

పిచ్చి ప్రేమలో నన్నే ముంచుతావే – Pichhi Premalo Song Lyrics | Alias Rukmini

by Lakshmi Guradasi

Song Details

పాట : పిచ్చి ప్రేమలో (Pichhi Premalo)
చిత్రం: అలియాస్ రుక్మిణి (Alias Rukmini)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
గాయకుడు: కార్తీక్ (Karthik)
సాహిత్యం: కృష్ణకాంత్ (కెకె) (Krishna Kanth)
నటీనటులు : నితిన్ (Nithiin), ఆఫియా సయ్యద్ (Aafiya Sayed)

Pichhi Premalo Song Lyrics in Telugu

చిరు చిరు చిలకవే
చిన్నెలున్న అలకవే
చిత్రమైన మనసువే… వయ్యారి

అరకొర పొగరువే
అందమైన సగమువే
అల్లుకున్న సొగసువే…
నా దేవి!

అటు ఇటు వెతికినా ఒంటరైన మనసుకు
అణువుగా దొరికిన చినదానా
చినుకులు ఎరగని పొడి పొడి బతుకుని
నిలువునా తడిపిన చిరువాన

నేలకు దిగుతూ తారసపడిన
తారవు నీవే పూబోణీ
వెలుగులు నింపే వెన్నెల నీదే
నాకిక నువ్వే మా రాణి

పిచ్చి ప్రేమలో
నన్నే ముంచుతావే
ఓ వగలాడి

నచ్చే లెక్కలో
నన్నే మించుతావే

చందమామలా మచ్చ కూడా లేదే
ఓ ప్రియురాలా
ఎన్ని చెప్పినా ఇంకా తక్కువేనే…

నా కథలో ఒక పేజీనే
నే తెలిసే నీకే దాచానే
తప్పే ఏమున్నా నాదే నేరం
తెలిశాక ఏమౌనో
నే పడలేనే నీ కోపం
కనుకే సందేహం నా గుండెలో

కొంచెం తట్టుకోదే నా ప్రాణం
నువ్వు గాని దూరమైతే ఓ నిమిషం
పక్కనుంటేనే సంతోషం

చెలియా… చెలియా చెలియా…

నిత్యం నీడలాగా ఉంటానే
నీకు ఆటబొమ్మ నేనవ్వుతానే
జంట తీగలాగా చూడతానే

చెలియా… చెలియా చెలియా…

పిచ్చి ప్రేమలో
నన్నే ముంచుతావే
ఓ వగలాడి

నచ్చే లెక్కలో
నన్నే మించుతావే

చందమామలా మచ్చ కూడా లేదే
ఓ ప్రియురాలా
ఎన్ని చెప్పినా ఇంకా తక్కువేనే…

కొంచెం తట్టుకోదే నా ప్రాణం
నువ్వు గాని దూరమైతే ఓ నిమిషం
పక్కనుంటేనే సంతోషం

చెలియా… చెలియా చెలియా…

Pichhi Premalo Song Lyrics in English

Chiru chiru chilkave
Chinnelunna alakave
Chithramaina manasuve… vayyaari

Arakora pogaruve
Andhamaina sagamuve
Allukunna sogasuve…
Naa Devi!

Atu itu vethikina ontaraina manasuku
Anuvuga dhorikina chinadhana
Chinukulu eragani podi podi bathukuni
Niluvuna thadipina chiruvaana

Nelaku diguthu thaarasapadina
Tharavu neeve pubhoni
Velugulu nimpe vennela needhe
Naakika nuvve maa Raani

Picchi premalo
Nanne munchuthave
O vagalaadi

Nachche lekkalo
Nanne minchuthave

Chandamaamalaa machcha kuda ledhe
O priyuraala
Enni cheppinaa inkaa thakkuvene…

Naa kathalo oka pejinee
Ne thelise neeke dhachane
Thappe Emunna naadhe neram
Thelisaaka emauno
Ne padalene nee kopam
Kanuke sandheham naa gundelo

Konchem Thattukodhe naa praanam
Nuvvu gaani dhooramaithe o nimisham
Pakkanuntene santosham

Cheliyaa… cheliyaa cheliyaa…

Nithyam needalaaga untaane
Neeku attabomma neeke avthane
Janta theegalaaga chudathaane

Cheliyaa… cheliyaa cheliyaa…

Picchi premalo
Nanne munchuthave
O vagalaadi

Nachche lekkalo
Nanne minchuthave

Chandamaamalaa machcha kuda ledhe
O priyuraala
Enni cheppinaa inkaa thakkuvene…

Konchem Thattukode naa praanam
Nuvvu gaani dhoramaite o nimisham
Pakkanuntene santosham

Cheliyaa… cheliyaa cheliyaa…

Read also : Ruku Ruku Rukmini Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like