Mamidakulu Lyrics Bullet Bandi Laxman

‘మామిడాకులు’ Mamidakulu Lyrics | Bullet Bandi Laxman

by Lakshmi Guradasi

Song Credits :

పాట : మామిడాకులు (Mamidakulu)
గానం : బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman), శ్రీనిధి (Srinidhi)
రచన : బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీతం : కళ్యాణ్ కీస్ (Kalyan keys)
దర్శకత్వం : బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)

Mamidakulu Lyrics Bullet Bandi Laxman in Telugu

తోటమాలింటికి కోటలో పోరాడే అల్లుడై వచ్చేనమ్మో
ఆరతియ్యరమ్మో ఆరతియ్యరమ్మో అశ్వమేదిగనియేరమ్మో
ఎండలొచ్చిండుల్లో గొడుగు పట్టురుల్లో మా రాజ కుమారునికి
పూలు పరువుండుల్లో పూలు పరువుండుల్లో కందిపోకుండా ఆ ముద్దు పాదాలకి
ఏ జన్మ రుణమన్నదో మన ఇంటి మారాణికి
తన చేతులే అంటేనమ్మో ఆమె పాదాల పారాణికి

నా మేడలు నా నీడలు నిన్ను భయపెడతా ఉంటే
వట్టి చేతుల్తో వస్తానమ్మో నన్ను పెళ్లి చేసుకుంటానంటే
నా బాధలు నా గోసలు నువ్వెందుకు పడతావయ్యో
ఆ భగవంతుడు నిన్నెపుడు సల్లంగా చూడాలయ్యో
నా తోటలో మాలి బిడ్డ నా కోటకి రాణివంట
ఆ కోట నాకెందుకంట ఉన్నంతలో నేను ఉంటా
కొండంత నేనున్నా నీ మనసు అద్దాన సిన్నంగా కానరానా

ఆ మామిడాకుల మీద ఆన పచ్చ తోరణాలై దాయెజానా
ఆ వరి పైరు మీద నా ఆన అవి అక్షింతలే అయ్యేనా
ఆ పత్తి పంటల మీద ఆన పట్టు చీరలై వస్తాయే జానా
ఆ పసుపు కొమ్ముల మీద ఆన అవి నలుగై నన్ను అంటేనా

ఏడుళ్ళ పేరున్న పిల్లగాడు నా ఏలు ఎట్టా పడతాడయ్యో
నన్ను ఎట్లేలుకుంటాడయ్యో
ఏడేడు జన్మాల ప్రేమే గుండెల్లో నిండా నింపుకున్నా
నీతో ఏడడుగులేస్తానమ్మా
నీ కళ్ళు మూసుకున్నాయా నన్ను ప్రేమిస్తున్నావు
మది కళ్ళు తెరుచుకున్నాయే నిన్నే పూజిస్తున్నాను
నిన్ను కన్నోళ్లు కన్నీళ్లు పెడితేరేమో పేదింటి పిల్లనంటే
పేదరికమన్నది నీ ఒంటికేని నీ మనసుకేడున్నదే
నా యావదాస్తి అంత నీ కాలి కిందున్న ధూళికి సరితూగునా

ఆ మామిడాకుల మీద ఆన పచ్చ తోరణాలై దాయెజానా
ఆ వరి పైరు మీద నా ఆన అవి అక్షింతలే అయ్యేనా
ఆ పత్తి పంటల మీద ఆన పట్టు చీరలై వస్తాయే జానా
ఆ పసుపు కొమ్ముల మీద ఆన అవి నలుగై నన్ను అంటెనా

నా ఇంటిలోనా వాళ్ళకంటే నా మాటంటే ఓ గౌరవం
చిన్నబోనియ నీ గౌరవం
నా జన్మకే అర్ధమవుతా ఉంది నీ గుండెల్లో నా గౌరవం
నీ ప్రేమ పంజరంలో పావురం
చచ్చిపోయేంత ప్రేమ నువ్వంటే చెప్పలేనే నువ్వెందుకంటే
నచ్చుతున్నానే నాకు నేనంటే ఎందుకో నువ్వు పక్కనంటే
ఇన్నాళ్ల నా ఎదురుచూపులన్ని ఎన్నెలై కురిసెనమ్మో
కొన్నాళ్ల నిన్ను నేను దాచుకోని ఆడదానినై పోతినయ్యో
నీ గుణము కిందంతా నా మొండితనమంతా తలవంచుతా పందేల్లో

ఆ మామిడాకుల మీద ఆన పచ్చ తోరణాలై దాయెజానా
ఆ వరి పైరు నా మీద ఆన అవి అక్షింతలే అయ్యేనా
ఆ పసుపు కొమ్ముల మీద ఆన అవి నలుగై నన్ను అంటలా
పత్తి పంటల మీద ఆన పట్టు చీరలై నేను పట్టాలా

Read also: O Janamma Folk Song lyrics Usha Akka

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like