Song Credits:
సాంగ్ : ఓ జానమ్మ (O Janamma)
సాహిత్యం:– కొంగరి కృష్ణ (Kongari Krishna)
సంగీతం:- ప్రవీణ్ అర్జున్ (Praveen Arjun)
గాయకులు:- ఉషా అక్క (Usha Akka), నికితా దామ (Nikitha Dama)
తారాగణం : జాను (Jaanu), సాగర్ (Sagar), లక్ష్మి (Laxmi)
O Janamma Folk Song lyrics Usha Akka in Telugu
దుబ్బురు దుబ్బు రెంటికాళ్లు దువ్వ రాదు ముడువ రాదు
దుబ్బురు దుబ్బు రెంటికాళ్లు దువ్వ రాదు ముడువ రాదు
దువ్వనిస్తా దూవుకావమ్మో ఓ జానమ్మ
దువ్వనిస్తా దూవుకావమ్మో ఓ జానమ్మ
దువ్వ దువ్వ దూసకుర్లు దువ్వరాద పైడి కుర్లు
దువ్వ దువ్వ దూసకుర్లు దువ్వరాద పైడి కుర్లు
దూసి కట్టిన కొప్పు మీదనో ఓ రాదమ్మ
పైడి తుమ్మెద లాలేనో ఓ రాదమ్మ
బంగారు తుమ్మెద లాలేనో ఓ రాదమ్మ
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నీ సాటి పడుచొల్ల కన్ననో ఓ జానమ్మ
నువ్వే మరి ముద్దుగున్నావో ఓ జానమ్మ
బిందె మీద బిందె పెట్టి నవ్వుకుంట కన్నుగట్టి
బిందె మీద బిందె పెట్టి నవ్వుకుంట కన్నుగట్టి
ఎవరికోసం ఎదురు చూపులో ఓ జానమ్మ
ఎవరికోసం ఎదురు చూపులో ఓ జానమ్మ
కాళ్ళకు కంచుంగురాలు కట్టిన పాడాల చీర
కాళ్ళకు కంచుంగురాలు కట్టిన పాడాల చీర
బావకోసం ఎదురు చూపులో ఓ రాదమ్మ
బావకోసం ఎదురు చూపులో ఓ రాదమ్మ
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నీ సాటి పడుచొల్ల కన్ననో ఓ జానమ్మ
నువ్వే మరి ముద్దుగున్నావో ఓ జానమ్మ
కడవ మీద కడవ పెట్టి కండ్లకు కాటిక పెట్టి
కడవ మీద కడవ పెట్టి కండ్లకు కాటిక పెట్టి
ఏ ఊరి వాడల్ల పోతవో ఓ జానమ్మ
ఏ ఊరి వాడల్ల పోతవో ఓ జానమ్మ
సిలువరంచు పట్టు చీర సింగులు మెరువ కట్టుకొని
సిలువరంచు పట్టు చీర సింగులు మెరువ కట్టుకొని
మా ఊరి వాడల్ల పోతానో ఓ రాదమ్మ
మా ఊరి వాడల్ల పోతానో ఓ రాదమ్మ
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నీ సాటి పడుచొల్ల కన్ననో ఓ జానమ్మ
నువ్వే మరి ముద్దుగున్నావో ఓ జానమ్మ
సెంబు మీద సెంబు పెట్టి చేతుల సెయ్యేసి చెప్పు
సెంబు మీద సెంబు పెట్టి చేతుల సెయ్యేసి చెప్పు
ఎవ్వరింటి కోడలైతవో ఓ జానమ్మ
ఎవ్వరింటి కోడలైతవో ఓ జానమ్మ
చూడా చక్కని వాడు చుక్కలోన చందురూడు
చూడా చక్కని వాడు చుక్కలోన చందురూడు
నీ యింటికి కోడలైతనో ఓ రాదమ్మ
నీ కొడుకుకు ఆలినైతనో ఓ రాదమ్మ
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నిమ్మ సకన నీడ సకన బొమ్మల నడుమ బొట్టు సకన
నీ సాటి పడుచొల్ల కన్ననో ఓ జానమ్మ
నువ్వే మరి గమ్మత్తున్నవో ఓ జానమ్మ
నువ్వే మరి ముద్దుగున్నవో ఓ జానమ్మ
Read aslo: Tella Cheera Tella Raika Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.