సన్న సన్న బియ్యమే… మదానో నా వయ్యారి…
సరువల్ల వంటలే… మదానో నా వయ్యారి…
సన్న సన్న బియ్యమే… మదానో నా వయ్యారి…
సరువల్ల వంటలే… మదానో నా వయ్యారి…
చోర చోర పోరడె నాకు సోపతైతా నన్నాడే…
సూది ముల్లే ఇప్పెనే అది సూరులోన పెట్టెనే…
అది గుచ్చుకుంటే నొచ్చెనే చలి సవట పుట్టుకోచ్చెనే…
సన్న సన్న బియ్యమే… మదానో నా వయ్యారి…
సరువల్ల వంటలే… మదానో నా వయ్యారి…
మద్ది చెట్ల కిందనే… మదానో నా వయ్యారి…
బుద్ధి తీర్చుమంటాడే… మదానో నా వయ్యారి…
మద్ది చెట్ల కిందనే… మదానో నా వయ్యారి…
బుద్ధి తీర్చమంటాడే… మదానో నా వయ్యారి…
రాక పోకలుంటినే… బాకీలు ఉంటానంటాడే…
బతిమిలాడుకుంటాడే… భామలాడుకుంటాడే…
ఆడంటే పిచ్చి వట్టెనే ఈడంత దానమిత్తనే…
వడ్ల రోడు కాడనే… మదానో నా వయ్యారి…
ముచ్చటెట్లా తీరునే… మదానో నా వయ్యారి…
గడి గడికి ఫోను చేస్తాడే… మదానో నా వయ్యారి…
గమ్మతి అనిపిస్తాడే… మదానో నా వయ్యారి…
గడి గడికి ఫోను చేస్తాడే… మదానో నా వయ్యారి…
గమ్మతి అనిపిస్తాడే… మదానో నా వయ్యారి…
గడుసు పోరగాడే నన్ను గాయి గాయి చేస్తాడే…
వద్దు గిద్దు అన్నగాని హద్దు దాటమంటాడే…
కాకింగిలి చేసెనే నా మూతింగిలి ఆయెనే…
గావుండల్ల పిల్లనే… మదానో నా వయ్యారి…
గావురంగాచూస్తాడే… మదానో నా వయ్యారి…
చల్ల పూట మెల్లగా… మదానో నా వయ్యారి…
చప్పరిస్తానంటాడే… మదానో నా వయ్యారి…
చల్ల పూట మెల్లగా… మదానో నా వయ్యారి…
చప్పరిస్తానంటాడే… మదానో నా వయ్యారి…
అల్లాడిపోతా ఉన్నాడే సల్లారకుండా చూస్తాడే…
తప్పని అనిపించినాన్ని తిప్పలైతే పెట్టనే…
మానడిచ్చే కాడ పొదరి మాసమన్నా ఇంతనే…
ప్రేమ వలక వోస్తాడే… మదానో నా వయ్యారి…
పెళ్ళామా అని పిలుస్తాడే… మదానో నా వయ్యారి…
ఓ వంక పెట్టుకుంటాడే… మదానో నా వయ్యారి…
నన్నెంకులాడుతుంటాడే… మదానో నా వయ్యారి…
వంక పెట్టుకుంటాడే… మదానో నా వయ్యారి…
ఎంకులాడుతుంటాడే… మదానో నా వయ్యారి…
నే కంటా పడకుండాకుంటెనే చంటి పోరాడైతాడే…
సిరిమంతుడు చిన్నబోయి శరణు వేడుకుంటాడే…
ఈ చిన్నది కనపడితే చిన్న సంబురంతో ఉంటాడే…
దిక్కులన్నీ చూస్తాడే… మదానో నా వయ్యారి…
దిగులుగా కూసుంటాడే… మదానో నా వయ్యారి…
____________________________-
Song Credits:
సాంగ్ : సన్న సన్న బియ్యమే (Sanna Sanna Biyyame)
గాయకులు : శిరీష – గంగమణి (శిరీష – గంగామణి)
సాహిత్యం : పాంబాల రమేష్ (పంభాల రమేష్)
సంగీతం : వెంకట్ అజ్మీరా (వెంకట్ అజ్మీరా)
నటీనటులు : మాధురి రాథోడ్ – ఈశ్వర్ సాయి (మాధురి రాథోడ్ – ఈశ్వర్ సాయి)
నిర్మాత : అనిల్ గౌడ్ రంగూ (అనిల్ గౌడ్ రంగు)
See Also: Pramila folk song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.