ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు వుందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు వుందే గుర్తు పట్టే గుండెనడుగు
కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు
అడగరే ఒకొక్క అల పేరు ఊఊఉ
మనకిల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలికారే మనిషి అంటే ఎవరూ ఊఊఉ
సరిగా చూస్తున్నాదా నీ మది గదిలో నువ్వే కదా వున్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోటా నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైనా భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైనా మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఎం వేస్తావో కానీ
తారరరరె తారరరరె తారరరరె తారారారే
తారరరరె తారరరరె తారరరరె తారారారే
తారరరరె తారరరరె తారరరరె తారారారే
In English Version:
Enthavaraku endukoraku intha parugu ani adakku
Gamaname nee gamyamaithe baatalo nee brathuku doruku
Prashnalo nee badhulu vunde gurtu patte gunde nadugu
Prapancham neelo unnadhani cheppedhaaka aa nijam telusukovaa
Telisthe prathi chota ninnu nuvve kalusukoni palakarinchukovaa
Enthavaraku endukoraku intha parugu ani adakku
Gamaname nee gamyamaithe baatalo nee brathuku doruku
Prashnalo nee badhulu vunde gurtu patte gunde nadugu
Kanapade ennenni kerataalu kalagalipi samudram antaaru
Adagaru okkokka ala peru ooo
Manakela eduraina prativaaru manishane sandraana kerataalu
Palikaaru manishi ante evaru ooo
Sarigaa choosthunnaadaa nee madi gadilo nuvve kadaa unnadi
Chuttu addaalalo vidi vidi roopaalu nuvvu kaadantunnadi
Nee oopirilo ledaa gaali veluthuru nee choopullo ledaa
Mannu minnu neeru anni kalipithe nuvve kaadaa kaadaa
Prapancham neelo unnadhani cheppedhaaka aa nijam telusukovaa
Telisthe prathi chotaa ninnu nuvve kalusukoni palakarinchukovaa
Manasulo neevaina bhaavaale bayata kanipisthaayi drushyalai
Needalu nijaala saakshyaale ye
Shatruvulu neeloni lopale snehitulu neekunna ishtaale
Ruthuvulu nee bhaava chitraale ye
Eduraina mandahaasam neeloni chelimi kosam
Mosam rosham dvesham nee maithili madhiki bhaashyam
Puttuka chaavu rende rendu neekavi sontham kaavu ponee
Jeevithakaalam neede nestham rangulu em vesthaavo kaani
Taarararare taarararare taarararare taaraaraare
Taarararare taarararare taarararare taaraaraare
Taarararare taarararare taarararare taaraaraare
___________________
Song Credits:
పాట: ఎంతవరకు (Enthavaraku)
చిత్రం: గమ్యం (Gamyam)
తారాగణం: అల్లరి నరేష్ (Allari Naresh), కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee), శర్వానంద్ (Sharwanand)
సంగీత దర్శకుడు: E. S. మూర్తి (E. S. Murthy)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: రంజిత్ (Ranjith)
See Also plz click on this: shyam-singha-roy-sirivennela-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
