సిరివెన్నెల (Sirivennela) సాంగ్ లిరిక్స్ | శ్యామ్ సింగ రాయ్ (Shyam singha roy)

by Lakshmi Guradasi

నెలరాజునీ.. ఇల రాణినీ.. కలిపింది కదా సిరివెన్నెల
దూరమా.. దూరమా.. తీరమై చేరుమా..
నడి రాతిరిలో.. తెరలు తెరచి..
నది నిద్దురలో.. మగత మరచి..
ఉదయించినదా… కులుకులొలుకు చెలి మొదటి కలా..
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝణకు ఝణకు.. సరి కొత్త కళా..

ఓ ఛాంగురే.. ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి
అయ్యహో.. ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తెరదాటి.. చెర దాటి.. వెలుగు చూస్తున్న భామని
సరిసాటి.. ఎద మీటి.. పలకరిస్తున్న శ్యాముని
ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే.. విరబూసే ఆశలై..
నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవల
మౌనాలే మమతలై.. మధురాల కవితలై
తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు.. సరి కొత్త కళా..

ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన.. సంకోచం మెరిసినా
ఆ రెంటికి మించిన పరవశ లీలను కాదని అనగలమా
కథ కదిలే వరుసన.. తమ ఎదలేం తడిసినా
గత జన్మలు పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు… సరి కొత్త కళా..

తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో ఛమకు ఛమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు… సరి కొత్త కళా..

In English Version:

Nelarajuni.. ila raanini.. kalipindi kada sirivennela
Dooramaa.. dooramaa.. teeramai cherumaa..
Nadi raatirilo.. teralu terachi..
Nadi nidduralo.. magatha marachi..
Udayinchinadaa… kulukuloluku cheli modati kalaa..
Tana navvulalo thaluku thaluku
Tana chempalalo chamaku chamaku
Tana muvvalalo jhanaku jhanaku.. sari kottha kalaa..

O changure.. inthatidaa naa siri
Annadi ee sharada raatiri
Milamilaa cheli kannula tana kalalanu kanugoni achcheruvuna murisi
Ayyaho.. enthatidee sundari
Evvaroo raaru kada tana sari
Srushtike addamu choopaga puttinademo naari sukumaari
Idi ningiki nelaki jarigina parichayame

Teradaati.. cheradaati.. velugu choostunna bhaamani
Sarisati.. eda meeti.. palakaristunna shyaamuni
Priyamaaraa gamanistoo pulakaristondi yaamini
Kalabose oosule.. viraboose aashalai..
Navaraatiri poosina vekuva rekhalu raasinadi navala
Mounaale mamatalaai.. madhuraala kavitalai
Tudi cherani kaburula kathakali kadilenu repati kathalaku munnudilaa
Tana navvulalo thaluku thaluku
Tana chempalalo chamaku chamaku
Tana muvvalalo jhanaku jhanaku.. sari kottha kalaa..

Idilaa ani evarainaa choopane ledu kantiki
Adelaago tanakainaa tochane ledu maataki
Ipudipude manasaina repu dorikindi choopuki
Santhosham sarasana.. sankocham merisinaa
Aa rentiki minchina paravasha leelanu kaadani anagalamaa
Katha kadile varusana.. tama edalem tadisinaa
Gatha janmala podavuna daachina daahamu ipude veeriki parichayamaa
Tana navvulalo thaluku thaluku
Tana chempalalo chamaku chamaku
Tana muvvalalo jhanaku jhanaku… sari kottha kalaa..

Tana navvulalo thaluku thaluku
Tana chempalalo chamaku chamaku
Tana muvvalalo jhanaku jhanaku… sari kottha kalaa..

____________________

Song Credits:

సాంగ్ : సిరివెన్నెల (Sirivennela)
చిత్రం : శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharama Sastry
తారాగణం: నాని (Nani), సాయి పల్లవి (Sai Pallavi)

See Also plz click on this: pranavalaya-pahi-song-lyrics-shyam-singh-roy

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like