ఎందుకు చెంతకి వస్తావో | Enduku chentaki vastavo lyrics

by Lakshmi Guradasi

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్ వదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎపుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా వీడదీస్తావో
ప్రణయమా పరిహాసమా

సెపించే దైవమా దహించే దీపమా ఇదే నీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ

ఎహ్ ఈఈ కలత కాలె మమతా

మరపురాని స్మృతులలోనే రగిలిపోతావా
మరలి రాని గతము గానే మిగిలిపోతావా

రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు
ఉరుకో ఓహ్ హృదయమా

నిజం నిష్ఠురమా విడిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ

వెంట రమ్మంటు తీసుకెళతావు
నమ్మి వస్తే నట్టడవిలో వేడిచిపోతావు
జంట కమ్మంటూ ఆశ పెడతావు
కలిమి ఉంచే చెలిమి తెంచే కలహమవుతావో

చేసిన బాసలు ఎన్నంటే చేపిన ఉస్సులు ఎమంటే
మౌనమా మమకారమా

చూపుల్లో సూన్యమా గుండెలో గాయమా మరి వేధించకే ప్రేమా
తరర ర ర ర తరర ర ర తరర ర ర రా

ఎందుకు చెంతకి వస్తావో ఎందుకు చెయ్ వదిలేస్తావో
స్నేహమా చెలగాటమా
ఎపుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా వీడదీస్తావో
ప్రణయమా పరిహాసమా

In English Version:

Enduku chentaki vastavo enduku cheyi vadilestavo
Snehama chelagatama

Epudu nee mudi vestavo eppudela veedadeestavo
Pranayama parihasama

Sepinche daivama dahinche deepama ide nee roopama prema
Phaliste papama kaliste kopama geliste nashtama prema

Eh ee kalatha kaale mamatha

Marapurani smruthulalone ragilipotava
Marali rani gathamugaane migilipotava

Reppalu daatavu swapnaalu cheppaka tappadu veedkolu
Uruko oh hrudayama

Nijam nishturama vidiste kashtama kanneetiki cheppave prema
Phaliste papama kaliste kopama geliste nashtama prema

Venta rammantu teesukelataavu
Nammi vaste nattadavilo vedichipotavu
Janta kammantu aasha pedataavu
Kalimi unche chelimi tenche kalahamauthavo

Chesina basalu ennante cheppina ussulu emante
Mounama mamakarama

Choopullo soonyama gundelo gayama mari vedhinchake prema
Tarara ra ra ra tarara ra ra tarara ra ra raa

Enduku chentaki vastavo enduku cheyi vadilestavo
Snehama chelagatama

Epudu nee mudi vestavo eppudela veedadeestavo
Pranayama parihasama

______________________

Song Credits:

పాట: ఎందుకు చెంతకి (Endhuku Chentaki)
చిత్రం: కొంచెం ఇష్టం కొంచెం కష్టం (Konchem Ishtam Konchem Kashtam)
తారాగణం: సిద్ధార్థ్ (Siddharth), తమన్నా భాటియా (Tamannaah Bhatia)
సంగీత దర్శకుడు: శంకర్-ఎహసాన్-లాయ్ (Shankar–Ehsaan–Loy)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: ఉన్ని కృష్ణన్ (Unni Krishnan)

See Also plz click on this: ale-ale-song-lyrics-boys

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like