Rathiri Rathiri Rathirilo folk song lyrics

రాతిరి రాతిరి రాతిరిలో (Rathiri Rathiri Rathirilo) folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
గొంగడేసి ఈడ పడ్ననే ఎప్పుడు ఈడ కొత్తవే

రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
గొంగడేసి ఈడ పడ్ననే ఎప్పుడు ఈడ కొత్తవే

చల్లమంత ఎత్తుకున్ననే కొంతన్నసేపు ఆగరాదే
రంగ రంగ తొవ్వలనే పేద్దటు జారి పడ్డనే
హే రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో

నిండకున్న పానమే చుట్ట మీద తీత్తున్నానే
పాలకంకోలే ఉన్నావే చిలుకోలే వాలిపోతనే
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో మంచేకాడికన్నా వచ్చిపోవో

ఊరి అవతలుంది మండవా నమ్మతాగి పడ్నవా
రోడ్ మీద నీవ్వున్నావా సోయి లేక పడ్నవా
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో నూకల కల్లు తాగిపోవో

కల్లు తాగి ఈడ పడ్ననే పానమంతా నీ మీదనే
ఈడు జోడు కోరుతున్నదే పానమంతా గుంజుతున్నదే
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో చందమామ లెక్క వచ్చిపోవో

నా చేతి నిండ గాజులున్నాయే లెత్తె సప్పుడైతదే
కాళ్ళకు గజ్జెలున్నాయే గళ్ళు గళ్ళు సప్పుడోత్తదే
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో

గోరు ముద్దలు పెట్టరాదే గోశాల ఈడ చూతున్నానే
అలిగి అలిగిపోతున్నవే సిగ్గులు చెక్కుతూ యాడికె
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో అలిగి పోతున్నావు యాడికో

నెత్తికి ఎర్రని రూమలిరో ఎంత చక్కంగా ఉన్నవురో
కొంచేటి మీసాలు తిప్పకురో కళ్లకిందికెళ్లి చూడకూరో
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో అత్తె నన్నెడ ఇడతావురో

ఇచ్చటనన్న రారాదే ఇంటెనకకెల్లి రారాదే
సంధు చూసి నువ్వు రారాదే సాకన్న చెప్పి రారాదే
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో చూట్టపు చూపోలె వచ్చిపో

ముడుతవల ముచ్చట ఊరంతా తెలిసిపాయేరో
అర్ధమరాతిరి ముచ్చట అందరికి ఎరుకయేరో
రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో
రాతిరి రాతిరి రాతిరిలో నేను రాలేను ఆడికో

_________________

Song Credits:

సాంగ్ : రాతిరి రాతిరి రాతిరిలో (Rathiri Rathiri Rathirilo)
ట్యూన్ మరియు లిరిక్స్ – సంతోష్ (Santhosh) & ప్రశాంత్ (Prashanth)
గాయకుడు – నర్సింహులు (Narasimhulu) & ఉషక్క (Ushakka)
సంగీతం – కృష్ణుడు (Krishnudu)
తారాగణం – మాధురి రాథోడ్ (Madhuri Rathod) & ఈశ్వర్ సాయి (Eshwar sai)

See Also plz click on this: flight-ekki-podame-dubai-desham-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like