భల్లే భల్లే (Bhalle Bhalle) సాంగ్ లిరిక్స్ | Nari Nari Naduma Murari | Sharwanand

by Lakshmi Guradasi

Bhalle Bhalle Song lyrics Nari Nari Naduma Murari Sharwanand:

అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి
సౌభాగ్య లక్ష్మి పోలిక..
అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి
తానున్న చోటే వేడుక..

చూసేటి కళ్ళకెంత చూడ ముచ్చట
ముద్దైనా జంట విరట..
ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట
ఉందల్లా స్నేహమేనట…

జత గువ్వలై రివ్వు రివ్వున
కోన సాగింది ఇరువురి పరిచయం

భల్లే భల్లే భల్లే.. భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక

ఓ మాట చాలదా తియ్య తియ్యగా
ఏకాంతమే దరి రాదు కదా..
మోమాటమొదిలితే కాస్త చనువుగా
మనసు మనసును ఆక్రమించదా..

ఏ రుచి అభిరుచి ఏమి కలిసేనో
కొబ్బరి గాలుల వాలుగా..
ఏమది ఎదురుగా ఏమి చదివేనో
సమయాలు వెలిగాయి సరదాలుగా

భల్లే భల్లే భల్లే.. భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక

గడియారం చూసుకొని కాలక్షేపమే
గడియైన విడిపోనే పోరట
జరిగింది అందమైన ఇంద్రజాలమే
దైవికమైన అనుభందమేనట

నిన్నల్లో కలిసిన వారువీరిక వారే వీరైనారట
ఎవరు ఎవరో పోల్చలేమిక అంతగా ఒకటైపోయారట

భల్లే భల్లే భల్లే.. భల్లే బాగుందిలే
ఈ రెండు మనసుల కూడిక
మాయే చేసిందిలే మంత్రం వేసిందిలే
మలయాళ కేరళ వేదిక

భల్లే భల్లే భల్లే.. భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే.. భల్లే బాగుందిలే
భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే

In English Version:

Ammaayi achcha Telugu saampraadaaya sundari
Saubhaagya Lakshmi polika..
Abbaayi maatakaari mohanaangude mari
Thaanunna chote veduka..

Chooseti kallakentha chooda muchchata
Muddainaa janta virata..
Premanna ooha kooda ledu ichchata
Undallaa snehame nata…

Jatha guvvalai rivvu rivvuna
Kona saagindi iruvuri parichayam

Bhalle bhalle bhalle.. bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

O maata chaaladaa thiyya thiyyagaa
Ekaanthame dari raadu kadaa..
Momaatamodilithe kaastha chanuvugaa
Manasu manasunu aakraminchadaa..

Ae ruchi abhiruchi emi kaliseno
Kobbari gaalula vaalugaa..
Emadi edurugaa emi chadiveno
Samayaalu veligaayi saradaalugaa

Bhalle bhalle bhalle.. bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

Gadiyaaram choosukoni kaalakshepame
Gadiyaina vidipone porata
Jarigindi andamaina indrajaalame
Daivikamaina anubandhamenata

Ninnallo kalisina vaaruveerik vaarē veerainaarata
Evaru evaro polchalemika anthagaa okataipoyaarata

Bhalle bhalle bhalle.. bhalle baagundile
Ee rendu manasula koodika
Maaye chesindile mantram vesindile
Malayala Kerala vedika

Bhalle bhalle bhalle.. bhalle baagundile
Bhalle bhalle bhalle bhalle baagundile
Bhalle bhalle bhalle.. bhalle baagundile
Bhalle bhalle bhalle bhalle baagundile

_________________________

Song Credits:

పేరు: భల్లే భల్లే (Bhalle Bhalle)
చిత్రం: నారీ నారీ నడుమ మురారీ (Nari Nari Naduma Murari)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar)
నటీనటులు : శర్వానంద్ (Sharwanand), సాక్షి వైద్య (Sakshi Vaidya)

See Also plz click on this: darsanamey-song-lyrics-nari-nari-naduma-murari

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like