Home » చిక్కనే తెస్తాడో నా అల్లుడు (chickene thesthado na alludu) Folk సాంగ్ లిరిక్స్

చిక్కనే తెస్తాడో నా అల్లుడు (chickene thesthado na alludu) Folk సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
1.7K views
chickene thesthado na alludu folk song lyrics

చింతాకు పులా చీర నేను కట్టినా
నేను జడనిండ గుండుమల్లె పూలు పెట్టినా
అద్దంలో జూసి టిక్కు బొట్టు పెట్టినా
నేను మళ్ళొక్కసారి సింగు ఎక్కి సెక్కినా

నా గల్లా సంచిలుంది కారు బన్ను ఫోను
దానికి వచ్చే రింగు రింగుమంటూ టోను
ఎవడేమో అని ఫోను ఎత్తి చూడగానే
అత్త నీ అల్లుడని పట్నమే పిలిచే చూడు

చిక్కెనే తెత్తడో నా అల్లుడు
లేక మట్టనే తెత్తడో నా అల్లుడు
బీరునే తెత్తడో నా అల్లుడు
లేక కోటరే తెత్తడో నా అల్లుడు

ఆ… రెండేళ్ల కిందనే వాణ్ణి చూసినా
నా బంగారు బిడ్డకే జంట చేసినా
ముత్యాల పందిరేసి పెండ్లి జేసినా
నేను మురిపెంగా కట్నమంతా ముట్టజెప్పినా

మోటార్ సైకిల్ పెట్టలేదు అని
ఏడాది కింద నా మీద అలిగి చూడు
మల్లేందుకో ఏమో ఆలివారముతో
అత్త జల్దీ రమ్మని పట్నమే పిలిచే చూడు

చిక్కెనే తెత్తడో నా అల్లుడు
లేక మట్టనే తెత్తడో నా అల్లుడు
బీరునే తెత్తడో నా అల్లుడు
లేక కోటరే తెత్తడో నా అల్లుడు

అగో ఆనాటి నుంచి నన్ను ఇంత తీయగా
అత్త రమ్మని ఒక్కమాట కూడా పిలువలె
ఈనాడు ఏమి అక్కరొచ్చినదని
అత్త అత్తని ప్రేమానంత వొలకబోసేనే

ఒక్కగానొక్క నా ముద్దుల బిడ్డ
నీళ్లు గిట్ల పోసుకొని ఉన్నదా ఎట్లా
మనసున పడతలేదు ఏమిసేతునుల్లా
ఏది ఓటి చెప్పకుండా రండి లోన పెట్టి పిలిచే

చిక్కెనే తెత్తడో నా అల్లుడు
లేక మట్టనే తెత్తడో నా అల్లుడు
బీరునే తెత్తడో నా అల్లుడు
లేక కోటరే తెత్తడో నా అల్లుడు

అబ్బా అబ్బా అబ్బా అబ్బా
చింతాకు పులా చీర నేను కట్టినా
నా నడుముకు చెక్కుడు బిళ్ళ పెట్టినా
అద్దంలో కట్టు బొట్టు మల్ల జూసినా
నా అందాన్ని నాకు నేనే చూసి మురిసినా

చీరలే తెత్తడో నా అల్లుడు
లేక రైకలే తెత్తడో నా అల్లుడు
గొలుసులే తెత్తడో నా అల్లుడు
లేక గోసనే పెడతాడో నా అల్లుడు

___________________________

Song Credits:

సాంగ్ : చిక్కనే తెస్తాడో నా అల్లుడు (chickene thesthado na alludu)
నిర్మాత: వాలి (VALI)
సంగీతం: కళ్యాణ్ కీస్ (KALYAN KEYS)
సాహిత్యం: అంజి పీట్ల (ANJI PEETLA)
గాయకుడు: ప్రభ (PRABHA)
నటి: ప్రియా (PRIYA)

See Also plz click on this: peddi-reddy-song-lyrics-bullet-bandi-laxman

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.