అద్దం ముందు (Addham Mundhu) సాంగ్ లిరిక్స్ | భర్త మహాశయులకు విఘ్నప్తి

by Lakshmi Guradasi

హే చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే
సన్నజాజి కావాలంటే సంత మొత్తం మోసుకొస్తాడే
అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే
కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే

హ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే
ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..

నీకు నచ్చిన సంగీతమేంటి ?
నీ చెప్పుల సవ్వడి..
నువ్వు మెచ్చిన నగలు ఏంటి?
మెడ వంపున ముద్దు తడి..
నీకిష్టమైన చోటు ఏంటి?
అది చల్లని నీ ఒడి..
నువ్వు కోరుకున్న దుస్తులేంటి?
నీ వెచ్చని కౌగిలి.. నులి వెచ్చని కౌగిలి..

నా ఇష్టలేవైనా నీతోనే పెనవేయగా
నువ్వు తప్ప ఇంకేవైనా.. నా కంటికి కనిపించునా..

హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే
అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..

హే నీకు నచ్చిన పరిమళమేంటి?
నీ ఒళ్ళే నిలువెల్లా..
నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి?
గుండె కంటిన బొట్టు బిల్లా..
నువ్వు రోజు చదివేదేంటి?
నీ పరువాల పత్రికని..
నువ్వు చోడొద్దు అనుకున్నదేంటి?
నీ కన్నుల నీటిని.. నీలి కన్నుల నీటిని..

ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే విలే లేదు
కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా..

హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..

In English Version:

Hey challa gaali kaavalante chandamaamanu teesukostaade
Sannajaaji kaavalante santha mottam mosukostaade
Adigindi andistaade, anthaku minchindi techchistaade
Korindi teerustaade vere korika naastinka lekunna chesthaade

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Aa addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

Neeku nacchina sangeetame enti?
Nee cheppula savvadi
Nuvvu mecchina nagala enti?
Meda vampuna mudda tadi
Neekishtamaina chotu enti?
Adi challani nee odi
Nuvvu korukunna dustule enti?
Nee vecchani kaugili… nuli vecchani kaugili

Naa ishtale vaina neetone penaveyaga
Nuvvu thappa inkaveyna naa kantiki kanipinchunaa

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

Hey neeku nacchina parimalame enti?
Nee olle niluvellaa
Nuvvu mecchina painting enti?
Gunde kantina bottu billa
Nuvvu roju chadivede enti?
Nee paruvaala patrikani
Nuvvu choododdu anukunnade enti?
Nee kannula neetini… neeli kannula neetini

Evvare praanalu vaallu chooselae viledu
Kaani naa pancha praanala roopaanni neelo choosthunna

Hoy addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene
Addam mundu nilabadi abaddham cheppalene
Naa addam anthe nuvve mari ee nijam daachalene

____________________

Song Credits:

పేరు: అద్దం ముందు (Addham Mundhu
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal), కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
రచయిత-దర్శకుడు: కిషోర్ తిరుమల (Kishore Tirumala)
నటీనటుల : రవితేజ (Ravi Teja), ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath)

See Also plz click on this: bella-bella-song-lyrics-bhartha-mahasayulaku-wignyapthi

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like