డిజైన్ నుంచి కెమెరా వరకు Vivo X300 ఎందుకు స్పెషల్?

by Jaya Anitha

ప్రతి సంవత్సరం  టెక్ మార్కెట్ లోకి ఎన్నో ఫోన్స్ వొస్తూనే ఉంటాయి.  కాని కొన్ని స్మార్ట్ ఫోన్స్  మాత్రమే గేమ్ చెంజర్  అవుతాయి. ఈ సంవత్సరం గేమ్ చెంజర్ అనే పేరు vivo x 300 కొట్టేసింది. VIVO X సిరీస్ లో VIVO X 300, VIVO X 300 PRO రెండు మోడళ్లు వొచ్చాయి. ఈ  స్మార్ట్ ఫోన్ December 1st లాంచ్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఎప్పుడూ కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో vivo ముందుంటుంది. అయితే ఆ లైన్‌లోకి రాబోతున్న తాజా ఫోన్ Vivo X300. Vivo X 300 PRO సిరీస్ ఫోన్లు ఎప్పుడూ కూడా స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో వొస్తుంటాయి.

VIVO  x 300 స్పెసిఫికేషన్స్ :

ఆండ్రాయిడ్16, Vivo ఆరిజిన్ ఓస్ 6తో vivo x 300 స్మార్ట్ ఫోన్ ని Dec 2 లాంచ్  చెయ్యనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే  3nm MediaTek Dimensity 9500 చిప్ సెట్ ప్రాసెసర్ తో వొస్తుంది.  ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం కంపెనీ టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.  Vivo x 300 కలర్ వొచ్చేసరికి క్లౌడ్ వైట్ కలర్. దీనికి 90W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. రెజల్యూషన్  అయితే 1216 x 2640 పిక్సెల్స్ 2K/1.5K తో ఇచ్చారు. ఇంక స్టోరేజ్, RAM చూసుకుంటే 12GB/16GB RAM + 256GB/512GB/1TB.   

  • VIVO X 300 ప్రో  లెవెల్ కెమెరా :

Vivo కెమెరా అంటే ఎప్పుడూ ప్రత్యేకమే.. X300 అయితే ఇంకా లెవెల్ అప్. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా  చూస్తే  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో 50 మెగాపిక్సల్ సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 50మెగా పిక్సెల్ SAMSUNG JN 1 అల్ట్రా-వైడ్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.  ఇది ప్రొఫషనల్ స్థాయి, ఫోటోగ్రాఫిక్ అనుభూతిని ఇస్తుంది. ముందు వైపు చూస్తే సెల్ఫీ, వీడియోకాల్స్ కోసం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే , ఫింగెర్ప్రింట్ సేన్సార్ ను  ఇచ్చారు. ఇంకా పిక్చర్స్ అయితే చెప్పక్కర్లేదు ఎ యాంగిల్ లో తీసిన  క్వాలిటీ సూపర్  క్లియర్ కట్ గా ఉంది.

  • ప్రీమియం డిస్ప్లే :

వివో సిరీస్ లో డిస్ప్లే విషయానికొస్తే దింట్లో చాల బాగుంటుంది.  6.31ఇంచెస్  LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు X 300కి  VS1 Pro ఇమేజింగ్ చిప్, V3+ ఇమేజింగ్ చిప్ ఉంటాయి. ఈ X 300 డిజైన్ చూస్తేనే  ప్రీమియం గా ఉందనిపిస్తుంది. అల్ట్రా స్లిమ్ బాడీ, కర్వ్డ్ ఎడ్జ్‌లు, గ్లాస్ బ్యాక్‌తో ఫోన్ చేతిలో చాలా లైట్‌గా, క్లాస్‌గా ఉంటుంది.  ముఖ్యంగా మల్టి టాస్కింగ్ , ఫోటోగ్రఫికి  మెయిన్ ప్రిఫెరెన్సు ఇచ్చే వాళ్ళకి “ది బెస్ట్ అని చెప్పచ్చు ”. 

VIVO X 300  ప్రో  ఫీచర్స్:

Vivo X300 PRO 3nm టెక్నాలజీతో తయారు చేసారు  కాబట్టి ఇది మరింత వేగంగా, తక్కువ పవర్‌తో పనిచేస్తుంది. ఇది 100x డిజిటల్ జూమ్ను , 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ APO టెలిఫోటో లెన్స్ తో పోట్రైట్ షాట్స్ , వీడియొ షాట్స్ కి చాల బాగా ఉపయోగపడుతుంది.  వీడియో ఎడిటింగ్ అయినా, 4K షూటింగ్ అయినా ఈ ఫోన్ ఏ పనినైనా చాలా స్మూత్‌గా చేస్కోవచ్చు. 

VIVO X 300 స్మార్ట్ ఫోన్ ధర :

Vivo X300 సిరీస్ అనేది “డబ్బు గురించి ఆలోచించకుండా, మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ కావాలి” అని అనుకునే వారి కోసం ఇది పర్ఫెక్ట్ ఫోన్. ధర ₹75,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే Vivo X300 Pro ధర ₹1,09,999 నుంచి మొదలవుతుంది అని అంచనాలు. అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న Vivo X300 కూడా డిజైన్, డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసిన పర్ఫెక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయ్యే అవకాశముంది. ఈ X 300 మరీ ముఖ్యంగా డేటా ట్రాన్సఫార్మింగ్, గేమింగ్ , వీడియో క్రియేషన్ కి చాలా బాగా ఉపయోగ పడుతోంది.

మరిన్ని ఆప్డేట్స్ కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like