ఏ కొమ్మకు ఏ పువ్వో (Ye Kommaki Ye Puvvo) సాంగ్ లిరిక్స్ | Motivational

by Lakshmi Guradasi

ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో
ఏ చెట్టుకు ఏ కాయ కాయాలో
ఏ గువ్వులు ఏ గూడు చేరాలో
అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు

ఏ గుండెకు ఎవ్వరు సవ్వడో
ఏ పెదవికి ఎవ్వరితో నవ్వులో
ఏ కథ ఏ తీరున సాగునో
అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు

నువ్వడిగి పుట్టావా మీ అమ్మకు
నువ్వు చెప్పేమన్నొచ్చావా మీ అయ్యకు
నువ్వెంచుకున్నావా నీ ఊరిని
నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్లని
లేదు నీ చేతుల్లో ఏది బాధేలరా
ఇప్పటిదాకా జరిగిందంతా నేమరేయరా
అంతా మనమంచికే అనుకోవాలిరా
అట్లా జరిగింది గనుకే ఇపుడు ఇట్టుందిరా
విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతవ్
ఓటమిలో ఉంటే నీకే ఎరుకయితది ఈ లోకం
ఇట్టాగే వుండి పోదురయ్యో నీ జీవితం

అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు

అవరోధం దాటాకే అందును శిఖరం
గెలిచిన ప్రతివాడి కథ చూడు
నా మాటే నిఖరం
కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు
భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వటవృక్షాలు
ఓటమి అవమానాలు ఊరికే రానేరావు
వస్తే ఏదో పాఠం నేర్పక పోనే పోవు
న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు
చేసిన సాయం తప్పా ఏదీ నీతో రాదు
పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయి కష్టాలు
పోయిందేమున్నది ఇపుడు ఉన్నయిగా ప్రాణాలు
ఒక దారి మూసుకుపోతే తెరిచుంటది ఇంకో రాదారి

అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు
ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు

In English Version:

Ee kommaku ee puvvu pooyalo
Ee chettuku ee kaaya kaayalo
Ee guvvulu ee goodu cheralo
Anni munduga raase untadu aa paivaadu
Eeda evvadu ledu jaragalsindi aape vaadu

Ee gundeku evaru savvado
Ee pedhaviki evaritho navvulo
Ee katha ee theeruna saaguno
Anni munduga raase untadu aa paivaadu
Eeda evvadu ledu jaragalsindi aape vaadu

Nuvvadigi puttaavaa mee ammaku
Nuvvu cheppemannochchaavaa mee ayyaku
Nuvvenchukunnava nee oorini
Nee toda butti navallu ayinolllani
Ledu nee chetullo aedi baadhe leraa
Ippatidhaaka jarigindantaa nemareyaraa
Anthaa mana manchike anukovaaliraa
Atlaa jarigindhi ganuke ippudu ittundiraa

Vijayamloni unte nuvvu lokaanike erukavutav
Ootamiloni unte neeke erukayithadi ee lokam
Ittage undipodurayyo nee jeevitham

Anni munduga raase untadu aa paivaadu
Eeda evvadu ledu jaragalsindi aape vaadu

Avarodham daataake andhunu shikharam
Gelichina prathi vaadi katha choodu
Naa maathe nikharaṁ
Kommalapai poosina aakulu neelana raalu
Bhoominni cheelchukuni puttina mokkale vatavrikshalu
Ootami avamaanalu oorike raane raavu
Vaste edo paatham nerpaka pone povu
Nyaayam neelo unte neeke edure ledu
Chesina saayam thappa edhi neetho raadu
Poraade dhammunnodine kavvistayi kashtaalu
Poyindemunnadhi ippudu unnayiga praanalu
Oka daari moosukupothe terichuntadhi inko raadhaari

Anni munduga raase untadu aa paivaadu
Eeda evvadu ledu jaragalsindi aape vaadu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like