వీర రాజా వీర (Veera Raja Veera) సాంగ్ లిరిక్స్, PS-2

by Lakshmi Guradasi

కళ్ళారా చూద్దాం
చోళ ఖడ్గ సంచారం,సంహారం
ఓ సోగసరి పువ్వా పూమాలే
శుభమని వేయవే

వీరా రాజ వీర శూరా ధీర శూర
నువ్వే శుభ్రతార
నీలో శౌర్యధార
ఏరై పొంగిపార
సమరం శ్రుతించెయిరా
శిఖరం స్పృశించెయిరా
మారా రాకుమారా చోరా చిత్త చోర
రారా ఏలుకోర
కరవాలమీవేల కనులెర్రజేయంగ
భుజబలము ఈ వేళ భూతలము మోయంగ
ద్ధైర్యము మోహరింప
రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ఠ రాజ తేజా సూర్య తేజ
వీరా రాజ వీర శూరా ధీర శూర

పడతులు పాటపాడ
మునితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
బేరులు ప్రతిధ్వనించ
సంద్రాల సుడిలోన
బడబానలము లాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ
నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ
నావికుడైన వీర
వీరా రాజ వీర శూరా ధీర శూర

ఆ…….
పడతులు పాటపాడ
మునితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
బేరులు ప్రతిధ్వనించ
సంద్రాల సుడిలోన
బడబానలము లాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ
నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ
నావికుడైన వీర
వీరా రాజ వీర శూరా ధీర శూర

సుడిగాడ్పులా అడుగేయరా
సర సర సర సర
శరమే తనువే తాకగ
చర చర చర చర
చెలరేగాలి వేగంగ

మగసిరి ఖండచూసి
కడలికి చెమట పోయు
పదునగు కత్తి చూసి
నింగికి నిదుర రాదు
రగతము పొంగి పారి
నదులకు రంగు మారు
తెగిపడు తలలు అన్ని
అలలకు అన్నమౌను
పులివలె దూకుతుంటె
జగములు జింకలౌను
నిన్నిక పొగడమంటె
భాషకు శ్వాస ఆగు
విధిగా తెగించెయిరా
విధినే వదించెయిరా
విలయం ధరించెయిరా
విజయం వరించెయిరా

వీరా రాజ వీర శూరా ధీర శూర
నువ్వే శుభ్రతార
నీలో శౌర్యధార
ఏరై పొంగిపార
సమరం శ్రుతించెయిరా
శిఖరం స్పృశించెయిరా
మారా రాకుమారా చోరా చిత్త చోర
ద్ధైర్యము మోహరింప
రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ఠ రాజ తేజా సూర్య తేజ

వీరా రాజ వీర
వీరా రాజ వీర
శూరా ధీర శూర
వీరా…

In English Version:

Kallaara choodham
Chola khadga sanchaaram samhaaram
O sogasari poovaa
Poomaale shubhamani veyave

Veera raja veera
Shoora dheera shoora
Nuvve shubhra thaara
Neelo shourya dhaara
Yerai pongi paara
Samaram shruthincheira
Shikharam sprushincheira
Maaraa raakumaara
Chora chitra chora
Raaraa yelukora
Karavaalameevela
Kanulerrajeyanga
Bhujabalamu ee vela
Bhuthalamu moyanga
Dhairyamu moharimpa
Rajyamu vistharimpa
Raja sreshta raja
Teja surya teja
Veera raja veera
Shoora dheera shoora

Padathulu paata paada
Mudhithalu naatyamaada
Dheerulu swaagathincha
Bheerulu prathi dhwanincha
Sandhraala sudilona
Badabaanalamu laaga
Bhuga bhuga kadhilinaava
Dhaga dhaga edhiginaava
Kalane gelichinaava
Nijamai nilichinaava
Vikrama vajra naava
Naavikudaina veera
Veera raja veera
Shoora dheera shoora

padathulu paata paada
Mudhithalu naatyamaada
Dheerulu swaagathincha
Bheerulu prathi dhwanincha
Sandhraala sudilona
Badabaanalamu laaga
Bhuga bhuga kadhilinaava
Dhaga dhaga edhiginaava
Kalane gelichinaava
Nijamai nilichinaava
Vikrama vajra naava
Naavikudaina veera
Veera raja veera
Shoora dheera shoora

Haa… padathulu paata paada
Mudhithalu naatyamaada
Dheerulu swaagathincha
Bheerulu prathi dhwanincha
Sandhraala sudilona
Badabaanalamu laaga
Bhuga bhuga kadhilinaava
Dhaga dhaga edhiginaava
Kalane gelichinaava
Nijamai nilichinaava
Vikrama vajra naava
Naavikudaina veera
Veera raja veera
Shoora dheera shoora

Sudi gaadpulaa adugeyyaraa
Sara sara sara sara
Sharame thanuve thaakaga
Chara chara chara chara
Chelaregaali vegangaa

Magasiri kanda choosi
Kadaliki chemata poyu
Padhunagu katthi choosi
Ningiki nidhura raadhu
Ragathamu pongi paari
Nadhulaku rangu maaru
Tegipadu talalu anni
Alalaku annamounu
Puli vale dhookuthunte
Jagamulu jinkalounu
Ninnika pogadamante
Bhaashaku swaasa aagu
Vidhigaa thegincheyraa
Vidhine vadhincheyraa
Vilayam dharincheyraa
Vijayam varincheyraa

Veera raja veera
Shoora dheera shoora
Nuvve shubhra thaara
Neelo shourya dhaara
Yerai pongi paara
Samaram shruthincheira
Shikharam sprushincheira
Maaraa raakumaara
Chora chitra chora
Raaraa yelukora
Karavaalameevela
Kanulerrajeyanga
Bhujabalamu ee vela
Bhuthalamu moyanga
Dhairyamu moharimpa
Rajyamu vistharimpa
Raja sreshta raja
Teja surya teja
Veera raja veera
Shoora dheera shoora

Veera raja veera
Veera raja veera
Shoora dheera shoora
Veera…

_______________

Song Credits:

పాట శీర్షిక: వీర రాజా వీర (Veera Raja Veera) – తెలుగు
ఆల్బమ్: PS-2 (తెలుగు)
సంగీతం: A.R.రెహమాన్ (A.R.Rahman)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు; శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), చిన్మయి శ్రీప్రద (Chinmayi sriprada)
దర్శకత్వం: మణిరత్నం (Mani Ratnam)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like