మాటే రాని చిన్నదాని (Mate rani chinnadani) సాంగ్ లిరిక్స్, O Papa Lali

by Lakshmi Guradasi

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను

కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు

సందె వేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా

In English Version:

Maate raani chinnadaani kalllu palike oosulu
Andaala anni pallavinchi aalapinche paatalu
Premae naaku panche jnaapakaluraa
Rege mooga talape valapu pantaraa

Maate raani chinnadaani kalllu palike oosulu
Andaala anni pallavinchi aalapinche paatalu
Premae naaku panche jnaapakaluraa
Rege mooga talape valapu pantaraa

Vennelalle poolu virisi thenelu chilikenu
Chenta cheri aadamarichi preemalu kosarenu
Chandanalu jallu kurise choopulu kalisenu
Chandamaama patta pagale ningini podichenu

Kanne pilla kalale naakika lokam
Sannajaaji kalale mohana raagam
Chilakalu palukulu alakalu ulukulu
Naa cheli sogasulu nanne maripinche!

Maate raani chinnadaani kalllu palike oosulu
Andaala anni pallavinchi aalapinche paatalu

Mudda banthi leta navvulu chindenu madhuvulu
Oosulaadu meni vagalu vannela jilugulu
Harivilluloni rangulu naa cheli sogasulu
Vekuvula melukolupae naa cheli pilupulu

Sande vela palike naalo pallavi
Santasala sirule naave annavi
Musi musi talapulu tharaga ni valapulu
Naa cheli sogasulu annee ika naave!

Maate raani chinnadaani kalllu palike oosulu
Andaala anni pallavinchi aalapinche paatalu
Premae naaku panche jnaapakaluraa
Rege mooga talape valapu pantaraa

___________

Song Credits:

పాట: మాటే రాని చిన్నదాని (Mate rani chinnadani)
సినిమా: ఓ పాపా లాలీ (O Papa Lali)
సంగీతం: ఇళయరాజా (Ilayaraja)
సాహిత్యం: రాజశ్రీ (Rajasri)
గాయకుడు: S.P. బాలు (S.P. Balu)
నటీనటులు: SP బాలసుబ్రమణ్యం (SP Balasubramaniam), రాధిక (Radhika)
రచన & దర్శకత్వం: వసంత్ (Vasanth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like