కన్నులలో కొత్తగా కోటి మెరుపులే మెరిసే
ఊపిరే పాడెనే కోయిలమ్మలా
గుండెలో వింతగా ప్రేమ చినుకులే కురిసే
ప్రాణమే మురిసేనే పూల పడవలా
ఎన్నో ఆశలు కొంటె ఊసులు
నిన్నే ఏరి కోరి చూసేనే
ఎన్నో ఊహలు తెల్లవారులు
నాలో యేరులాగా దూకేనే
కన్నుల చాటు కునుకు లేదు
మనసు చాటు కుదురు లేదు
పెదవి చాటు పలుకు రాదు
ఏంటిలా…
అలుపు లేని పిలుపు నువ్వు
అదుపులేని తలపు నువ్వు
నిమిషమైన నిలుపలేను నన్నిలా…
నీడలా నీ వెనకాలే నేను కదిలానుగా అలవాటుగా
పొలమరాగా నువ్వు తలిచావనుకుంటూ అలవోకగా ఎగిరానుగా
కాటుకెట్టి ఓ అందమైన చందమామ కళ్ళముందే దిగితే..
తొలి ప్రేమ పుట్టి మది అంతులేని హాయి పుట్టి
గంతులేసే కదవే
గాలి నిండా సుమ గంధాలే పోగేసే
దారి నిండా పరిచేసేవే
గుండె నిండా నిన్ను నింపేసుకున్నా
చెలియా.. జతగా.. సడిచేసేవే
కన్నుల చాటు కునుకు లేదు
మనసు చాటు కుదురు లేదు
పెదవి చాటు పలుకు రాదు
ఏంటిలా…
అలుపు లేని పిలుపు నువ్వు
అదుపులేని తలపు నువ్వు
నిమిషమైన నిలుపలేను నన్నిలా…
In English Version:
Kannulalo kottaga koti merupule merise
Oopire paadene koyilammalaa
Gundelo vintaga prema chinukule kurisē
Praaname murisenee poola padavalaa
Enno aashalu konte oosulu
Ninne eeri kori choosenee
Enno oohalu tellavaarulu
Naalo yerulaga dookenee
Kannula chaatu kunuku leedu
Manasu chaatu kuduru leedu
Pedavi chaatu paluku raadu
Entilaa…
Alupu leeni pilupu nuvvu
Adhupuleeni thalapu nuvvu
Nimishamainaa nilupalenu nannilaa…
Needalaa nee venakaale nenu kadilaanugaa alavaatugaa
Polamaragaa nuvvu thalichaavanukuntuu alavokagaa egiraanugaa
Kaatuketti o andamaina chandamaama kallamundee digite..
Tholi prema putti madi anthuleni haayi putti
Gantulesē kadave
Gaali nindaa suma gandhaale pogese
Daari nindaa paricheseve
Gunde nindaa ninnu nimpesukunnaa
Cheliyaa.. jathagaa.. sadichesēve
Kannula chaatu kunuku leedu
Manasu chaatu kuduru leedu
Pedavi chaatu paluku raadu
Entilaa…
Alupu leeni pilupu nuvvu
Adhupuleeni thalapu nuvvu
Nimishamainaa nilupalenu nannilaa…
____________
Song Credits:
సాంగ్ : కన్నుల చాటు (Kanula Chaatu)
సినిమా పేరు: సంఘర్షణ (Sangharshana)
గాయకులు: అర్జున్ రాజ్‌కుమార్ (Arjun Rajkumar), సమంతవిత (Samanthawitha)
సంగీత దర్శకుడు: ఆదిత్య శ్రీరామ్ (Aditya Sriram)
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
నటీనటులు: చైతన్య పసుపులేటి (Chaitanya Pasupuleti), రషీద్ (Rasheed)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
