పాణాలు పోతున్నట్టున్నాయే రేపో మాపో
ఎప్పుడెప్పుడో స్తావో చూడాలని ఓ బావ నిన్ను
వచ్చేస్తానే నా బంగారము రేపో మాపో
దిగమింగుతున్న ఈ దుఃఖాలను బతకాలని నీతో
గడియ గడియ కన్నీటి సుక్క తీస్తున్నా నా గడపలోన
గడప దాటి నీ వాకిల్లలో ముగ్గులేస్తానా ఈ జన్మలోన
పూట పూట పస్తులుండుకుంటా చూస్తున్న ఆ రోజుకి
దగ్గరున్న నీకు దూరమున్న ఏడున్నా నీ వాడినేగా
ఈ సీనయ్య గుండున్నదే సిన్నదాన నీకోసము
ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకెక్కిరింది అందాల విమానము
ఓ బావ చూస్తున్నానే ఇంటి మీనంగా విమానము
ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని కొట్టుకుంటుంది నా పాణము
ఖర్జురాల కన్నా కమ్మగుంటాయంట..
లేక లేక నేను ఫోను జెస్తే నువ్ హాల్లో అన్నవంటే
బెల్లం బువ్వ కన్నా తియ్యగుంటదంట..
ఎన్నడూ ఓనాడు ఫోను జేసి బాగున్నావన్నావంటే
ఏడాది ఎండల్లో ఒంటనై మోస్తున్నా
నా బతుకు కష్టాలనే
పిల్లా నీ చెయ్యి వట్టాలనే
నల్లని చీకట్లో ఒక్కదాన్నే కూసున్నా
దిక్కులేని పక్షినాయి
బావ నువ్వెప్పుడొస్తావని
ఏలైపోతుందే పిల్లా ఎన్నెలొచ్చింది మన బతుకులా
ఏలైపోతుందే పిల్లా యేలు పట్టంగా వస్తున్నాయా
ఇన్నాళ్ళ ఎడబాటు ఎడబాసిపోతుందిలే
ఈ సీనయ్య గుండున్నదే సిన్నదాన నీకోసము
ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకెక్కిరింది అందాల విమానము
ఓ బావ చూస్తున్నానే ఇంటి మీనంగా విమానము
ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానని కొట్టుకుంటుంది నా పాణము
ఇంటెనక నువ్వు ఉంటే వెనకేనక నేను వొచ్చి
నీ కళ్ళు మూయంగా కన్నీళ్లు అంటేనే నా రెండు చేతులకి
కన్నీళ్లు గావు అవి ఆనందబాష్పలులే
ఇన్నాళ్లకు నన్ను వదిలిపోతునందుకు ఒంటరితనం ఏడ్చేనే
బంగారు నకిలేసు నీ మెడకు తెచ్చిన ఓసారి వేసుకోవే
చూసి నా మనసు మురిసిపోయే
నా నల్ల పూసల దండ నువ్ ఉండంగా బంగారు నాకెందుకే
నా బంగారు నువ్వుంటేనే
పంతాలు పోయేలా పిల్ల మన బంధాలు కలిసాయిలే
కన్నోళ్లు మురిసిపోయేలా మన ప్రేమను గెలిచాములే
సుట్టు సుట్టాలా నడుమ నీ సిటీకేనేలు పడతానే..
ఈ సీనయ్య గుండున్నదే సిన్నదాన నీకోసము
ఈ దూరాన్ని చెరుపుతూ తీరాలకెక్కిరింది అందాల విమానము
ఓ బావ వేచున్నదే నా పాణమే నీకోసము
నువ్వు మూడు ముళ్లేస్తే నీ యేలు పట్టేస్తే నా జన్మకు అర్ధము..
In English Version:
Paanalu pothunnattunnaye repo maapo
Eppudeeppudo staavo choodaalani o baava ninnu
Vachestaane naa bangaaramu repo maapo
Digamingutunna ee duhkhaalanu batakaalani neetho
Gadiya gadiya kanniti sukka teestunnaa naa gadapaloona
Gadapa daati nee vaakillalo muggulestaanaa ee janmalona
Poota poota pastulundukuntaa choostunna aa roojuki
Daggarunna neeku dooramunna edunnaa nee vaadinegaa
Ee seenayya gundunnade sinnadaan neekosamu
Ee dooraannee cheruputhu teeraalakekkirindi andaala vimaanamu
O baava choostunnane inti meenanga vimaanamu
Eppudeppudu ninnu choodaalani kottukuntundi naa paanamu
Kharjuraala kanna kommaguntaayanta..
Leka leka neenu phoneu jeste nuv hallo annavante
Bellam buvva kanna tiyyaguntadanta..
Ennadoo onadu phoneu jesi baagunnaavannavante
Edaadi endallo onthanai mostunnaa
Naa batuku kashtaalane
Pillaa nee cheyyi vattaalane
Nallani cheekatlo okkadanane koosunnaa
Dikkuleni pakshinaayi
Baava nuveppudostaavani
Elaipothundee pillaa enne lochindi mana batukulaa
Elaipothundee pillaa yelu pattanga vastunnaayaa
Innaalla edabatu edabaasipothundile
Ee seenayya gundunnade sinnadaan neekosamu
Ee dooraannee cheruputhu teeraalakekkirindi andaala vimaanamu
O baava choostunnane inti meenanga vimaanamu
Eppudeppudu ninnu choostaanani kottukuntundi naa paanamu
Intenaka nuvvu unte venakenaka neenu ochi
Nee kalllu mooyanga kannillu antene naa rendu chetullaki
Kannillu gaavu avi aananda baashpalule
Innaallaku nannu vadilipotunanduku ontaritana yedchene
Bangaaru nakilesu nee medaku techina osari vesukove
Choosi naa manasu murisipoye
Naa nalla poosala danda nuv undanga bangaaru naakenduke
Naa bangaaru nuvvuntelene
Pantaalu poyelaa pillaa mana bandhaalu kalisayile
Kannollu murisipoyela mana premanu gelichaamule
Suttu suttalaa naduma nee sitike nelu padathane..
Ee seenayya gundunnade sinnadaan neekosamu
Ee dooraannee cheruputhu teeraalakekkirindi andaala vimaanamu
O baava vechunnade naa paaname neekosamu
Nuvvu moodu mullesthe nee yelu pattesthe naa janmaku ardhamu..
_____________
Song Credits:
సాంగ్: సీనయ్య గుండున్నదే (Seenayya Gundunnadhe)
సాహిత్యం & దర్శకుడు: బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman)
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గానం : బుల్లెట్ బండి లక్ష్మణ్ (Bullet Bandi Laxman), శ్రీనిధి (Srinidhi)
నటీనటులు: సంగం శ్రీనివాస్ (Sangam Srinivas), వైష్ణవి సోనీ (Vaishnavi Sony)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
