పాడే (Paade) సాంగ్ లిరిక్స్, Suresh Kadari | Nalgonda Gaddar Narsanna

by Lakshmi Guradasi

దేవా.. అయ్యో దేవా

పాడే రమ్మన్నదార నిన్ను పైనమైపోతున్నావు
పాపకారి లోకం లోన పక్షిలాగా కూలినావు
కాటి పిలిచినారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు
ప్రాణమైన అమ్మ నాన్నను కాదనెల్లిపోతున్నావు

కన్న పేగు కన్నీరయి కుమిలిపోయేరా
కన్న తల్లి కడుపు కోత చూడు దేవర
కొరివి పెట్టే కొడుకు నేడు సితికి చేరేరా
బూడిదైపోతూవుంటే ఎట్టా బతుకరా

ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా
కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా
ఎండికొండ నుండే జంగమా ఏంట తీసుకెళ్ళినవా
ఎట్టా ఉందుమయ్య సామీ మమ్ము మరిసిపోయినవా

గోరు ముద్దలెట్టినా కొడుకు గోడపటం ఆయన
చెయ్యి పట్టి నడిచిన కొడుకు చీకటి పాలైపోయెనా
గుండెలెక్కి ఆడిన కొడుకు గురుతు సేరిగిపోయెనా
కండ్ల ముందు కదిలిన కొడుకు కానరాకుండయానా
మాయదారి ప్రేమే వాడ్ని మట్టు పెట్టేనా
మల్లి రాని లోకాలకు సాగనంపేనా

ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా
కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా
ఎండికొండ నుండే జంగమా ఏంట తీసుకెళ్ళినవా
ఎట్టా ఉందుమయ్య సామీ మమ్ము మరిసిపోయినవా

ఆసరైతడనుకున్న కొడుకు ఆవిరైపోయెనా
బలము అయితాడనుకున్న కొడుకు బాధే ఇచ్చిపోయెనా
పేరుకొస్తాడనుకున్న కొడుకు ప్రేమకు బలైపోయెనా
పరువు మొస్తడనుకున్నా కొడుకు ఎక్కిపోయెనా
పాపకారి లోకమే చావు కోరేనా
పాపమనుకున్నా నేడు నవ్వుతు తిరుగునా

ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా
కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా
ఎండికొండ నుండే జంగమా ఏంట తీసుకెళ్ళినవా
ఎట్టా ఉందుమయ్య సామీ మమ్ము మరిసిపోయినవా

దేవా.. అయ్యో దేవా

_______________

Song Credits:

సాంగ్ : పాడే (Paade)
సాహిత్యం & దర్శకత్వం : సురేష్ కడారి (Suresh Kadari)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గాయకుడు : నల్గొండ గద్దర్ నర్సన్న (Nalgonda Gaddar Narsanna)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like