నిగమ నిగమాంత (Nigama Nigamantha) సాంగ్ లిరిక్స్, అన్నమయ్య (Annamayya)

by Lakshmi Guradasi

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభియా
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై

పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసాని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ

నీసా గసగసగసగసాగా
దానిసగమగసాగామగా సనిదస్స నీసాద
సగమా గామగా మదని దానిస మగసనిదమగస

వివిధ నిర్బంధముల
వివిధ నిర్బంధముల
వెడల ద్రోయకనన్ను
భవసాగరముల దడబడజేతురా

దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస
హరే హరే హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిస
నవనీతచోరా శ్రీ నారాయణ

నిగమ సగమగసనిదమగాని
నిగమ గసమాగధమనిదస్స

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ
వెంకట నారాయణ తిరుమల నారాయణ
కలియుగ నారాయణ హరి హరి నారాయణ
అది నారాయణ లక్ష్మి నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ

హరే హరే హరే హరే హరే

__________________

పాట: నిగమా నిగమంతా (Nigama Nigamantha)
చిత్రం: అన్నమయ్య (Annamayya)
నటీనటులు: నాగార్జున (Nagarjuna),
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
గీతరచయిత: అన్నమయ్య సంకీర్తనలు (Annamayya Sankirthanalu)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam), K.S. చిత్ర (K.S. Chitra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like