తిరిగే భూమి ఉన్న చోటే ఉంటుందా
వీచే గాలి నిమిషం అయినా నిలిచేనా..
ఒంటరివై నువ్వే మిగిలిపోకురా పదరా..
స్నేహం నీ తోడై అడుగేస్తూ ఉంటే సాగిపో..
ఓ నింగి నేల గాలి దారి నీదే…
హద్దే లేని స్వేచ్ఛలో ఎగిరి చుట్టేయ్ ధరణి..
నాతో తోడై రారా మేఘాల అంచుకే
ఆఖరి నిమిషం నిన్నే చేరేముందే
ఈ యవ్వనమే నీతో నడిచేటి ఇంధనం
అడుగే ఆపక నీ గమ్యమే చేరు.. ఓ ఓ ఓ
మీతో నడిచే ప్రతి అడుగు అనుభవం
నాకై మిగిలే ఓ తీపి జ్ఞాపకం
గడిదాటే గడియారమైనదే బ్రతుకే..
గడిచేటి గంటలైనవే నిమిషం..
లోకం నీ కోసం వేచి చూసేరా పదరా
సాగే ఈ దారి గుండెల్లో మిగిలే గురుతై..
ఓ దూకే నీరే చెలిమితో నన్నే తడిపే..
తాకే అలగా గతముకే నన్నే తోసే..
నాతో తోడై రారా శిఖరాల ఎత్తుకే
ఆఖరి నిమిషం నిన్నే చేరేముందే
దారే దూరం అంటూ ఏ చినుకు ఆగదే
మబ్బే దాటేసి ముద్దడదా భూమి.. ఓ ఓ ఓ
In English Version:
Tirige bhoomi unna chote untundaa
Veeche gaali nimisham ainaa nilichenaa..
Ontarivai nuvve migilipokuraa padaraa..
Snehame nee toadai adugestoo unte saagipo..
O ningi nela gaali daari neede…
Hadde leni svechhalo egiri chuttey dharani..
Naato toadai raaraa meghaala anchuke
Aakhari nimisham ninne cheremunde
Ee yavaname neetho nadicheti indhanam
Aduge aapaka nee gamyame cheru.. O o o
Meetho nadiche prati adugu anubhavam
Naakai migile o theepi gnaapakam
Gadidaate gadiyaaramainade bratuke..
Gadicheeti gantalainave nimisham..
Lokam nee kosam vechi chooserā padaraa
Saage ee daari gundello migile guruthai..
O dooke neere chelimito nanne tadipe..
Taake alagaa gatamuke nanne tose..
Naato toadai raaraa shikharaala eththuke
Aakhari nimisham ninne cheremunde
Daare dooram anto ee chinuku aagade
Mabbe daatesi muddadadaa bhoomi.. O o o
________
సాంగ్ క్రెడిట్స్ :
పాట: తిరిగే భూమి (Thirige Bhoomi)
చిత్రం: జిగ్రిస్ (JIGRIS)
నటీనటులు: కృష్ణ బురుగుల (Krishna Burugula), రామ్ నితిన్ (Ram Nithin), మణి వక (Mani Vaka), ధీరజ్ ఆత్రేయ (Dheeraj Athreya)
సంగీత దర్శకుడు: కమ్రాన్ (Kamran)
లిరిసిస్ట్: హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula)
గాయకులు: ఏకనాథ్ (Eknaath), జునైద్ (Junaid), సుధాంష్ (Sudhansh)
రచన & దర్శకత్వం: హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
