తరలి రాద తనే వసంతం (taralirada thane vasantham lyrics) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

గగనాల దాక అల సాగ కుంటే
మేఘాల రాగం ఇల చేరుకోద
తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

వెన్నెల దీపం కొందరిదా..
అడవిని సైతం వెలుగు కదా..
వెన్నెల దీపం కొందరిదా..
అడవిని సైతం వెలుగు కదా..

ఎల్లలు లేని చల్లని గాలి
అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏది సొంతం కోసం కాదను సందేశం
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ
దిశ లెరుగగని గమనము కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

బ్రతుకున లేనీ శ్రుతి కలదా
ఎద సడి లోనే లయ లేదా
బ్రతుకున లేనీ శ్రుతి కలదా
ఎద సడి లోనే లయ లేదా

ఏ కళ కైనా ఏ కల కైనా
జీవిత రంగం వేదిక కాదా
ప్రజా ధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ
పెదవిని విడి పలుకదు కద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాక అల సాగ కుంటే
మేఘాల రాగం ఇల చేరుకోద

తరలి రాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం

In English Version:

Taralirada tane vasantham
Tana dariki rani vanala kosam….
Gaganaladhaka ala saagakunte,
Meghaala raagam ila cherukodhaa…

Taralirada tane vasantham
Tana dariki rani vanala kosam….

Vennella deepam kondharidhaa..,
adavini saitham velugu kadha,
Vennella deepam kondharidhaa..,
adavini saitham velugu kadha,
Ellalu leni challanni gaali,
Andhari koosam Bhandhuvu kaagaa…
Prathi madhini leypey prabhatharaagam,
Padhey padhey choopey pradhana maargam
Eydhi sontham kosam kadhanu sandesam..
panchey guname pothey prapanchame sunyam…
idhi teliyani manugada kadha,
Disanerugani gamanamu kadha….

Brathukuna leni Shruthi kaladhaa,
Yedha sadilone laya ledhaa..
Brathukuna leni shruthi kaladhaa,
Yedha sadilone laya ledhaa..
Ey khala kainaa..Ey kala kaina..
Jeevitha rangam veedhika kaadha..
Prajadhanam kaani kalaa vilaasam,
Ey prayoganam leni vrudha vikaasam..
Koosey koila poothe kaalam aagindha…
Maare Eyrai paare maro padam raadha..
muraliki gala swaramuna kala pedhavini vidi palakadu kadhaa…

Taralirada tane vasantham,
Tana dariki rani vanala kosam….
Gaganaladhaka ala saagakunte,
Meghaala raagam ila cherukodhaa…

Taralirada tane vasantham
Tana dariki rani vanala kosam….

_____________________

Song Credits:

పాట : తరలి రాద తనే వసంతం (Tarali Raada Tane Vasantham)
చిత్రం: రుద్రవీణ (Rudraveena)
సంగీతం :: ఇళయరాజా (Illayaraja)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam)
సాహిత్యం :: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastry)
నటీనటులు : చిరంజీవి (Chiranjeevi), విజయశాంతి (Vijayashanti), రాధ (Radha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like