Home » కనులార చూద్దాము (Kanulara Chuddam) సాంగ్ లిరిక్స్, సింహా (Simha)

కనులార చూద్దాము (Kanulara Chuddam) సాంగ్ లిరిక్స్, సింహా (Simha)

by Lakshmi Guradasi
2K views
Kanulara chuddamu song lyrics Simha

అసుర గణమున ఉసురు నణచగా
ఇలకు దిగు నరసింహమ
కలదు కలదని అసుర శిశువుకు
శరణు నొసగిన దైవమా
ప్రణయ నరసింహా..
విజయ నరసింహా..
హింస నణచినా ఉగ్ర సింహ
పరమ హంస పావన
సిరుల రాణి ధీరుల నవ్వే
వరములే నారాయణ..

కనులార చూద్దాము కదలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

లక్ష్మి నరసింహ కళ్యాణం
భువికి దిగివచ్చే దివ్య వైభోగం
గగనమంతా పందిరై
భువనమే సుమ వేదికై
కళ్యాణం జరిగేనమ్మా కనుల పండువుగా

ఈ జగాన జరగనట్టి దేవతార్చనగా
ఏ యుగాలు ఎరగనట్టి మంత్ర పుష్పముగా

కనులార చూద్దాము కదలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

పోగలతో మంత్రాల గోషా రగులుతుంటే ముచ్చట
వగలతో శ్రీవారి పైన విసురు చూపే ముచ్చట

సిరికి హరియే సరి అనేటి సరసమింక ముచ్చట
జగమునేలే జవ్వనాలకు మూడు జగములు మొక్కగా
శుభములన్ని చుట్టములుగా కలలని వరకట్నములతో
ధర్మపురిగా యాదగిరిగా మంగళార్చన షికారిగా
సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ

కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

తరాలన్నీ తలంబ్రాలే తలకు చేరే ముచ్చట
నింగి నెలలు మృదంగలై మెలమయ్యే నిచట

తెరల చాటున చొరవ చేసే బాలకృష్ణుడి లీలాట
తాళి కట్టే వేళా సిరి మీద అల్లిబిల్లిగా గిల్లుట
అల్లుడైన గిల్లుడైన పెళ్లికొడుకే హరి అట
వేదగిరిగా అంతర్వేదిగా అహోబిళగిరి శీకారిగా
సింహగిరి కల్యాణ వేదిక విరిసే కన్నులు పండుగ

కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ
కళ్యాణం కళ్యాణం లక్ష్మి నరసింహ

కనులార చూద్దాము కదలి రారమ్మ
పసుపు కుంకుమ జంట కట్టి పెళ్లి నెడమ్మా

_______________

పాట: కనులారా చూద్దాం (Kanulara Chuddam)
చిత్రం: సింహా (Simha)
నటీనటులు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), నయనతార (Nayanthara), స్నేహ ఉల్లాల్ (Sneha Ullal)
సంగీత దర్శకుడు: చక్రి (Chakri)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి (Veturi Sundararama Murthy)
గాయకులు: మాళవిక (Malavika), చక్రి (Chakri)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.