Home » సింగరాల పైరుల్లోన (Singarala Pairullona) సాంగ్ లిరిక్స్, దళపతి (Dalapathi)

సింగరాల పైరుల్లోన (Singarala Pairullona) సాంగ్ లిరిక్స్, దళపతి (Dalapathi)

by Lakshmi Guradasi
3.8K views
Singarala Pairullona song lyrics

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి

ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట..
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి

వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటా..
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే

మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటలోన నీవే వెయ్యరా
తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి

బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడనీ జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట

హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే..
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంట ఏ వేళా..

శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వులజంట మేమే

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వేలిగేనట ఉల్లాసం నీదేనట

సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి

_____________

పాట పేరు: సింగరాల పైరుల్లోన (Singarala Pairullona)
సినిమా పేరు: దళపతి (Dalapathi)
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramaniyam) మరియు K.J.యేసుదాస్ (K.J.Yesudas)
సంగీతం: ఇళయరాజా (Ilaiyaraaja)
నటీనటులు: రజనీకాంత్ (Rajinikanth), మమ్ముట్టి (Mammootty), శోభన (Shobana)
దర్శకుడు: మణిరత్నం (Mani Ratnam)
నిర్మాత: జి. వెంకటేశ్వరన్ (G. Venkateswaran)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.