Home » ఏడేడు లోకాలు ఏలేటి రాముడు పార్ట్ 3 సాంగ్ లిరిక్స్

ఏడేడు లోకాలు ఏలేటి రాముడు పార్ట్ 3 సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi
2.1K views
Yededu lokalu yeleti ramudu part 3 song lyrics

సీతమ్మనే రాముడే బాధ పెట్టిన
రామయ్య పై ప్రేమ సచ్చిపోలేదే
వద్దంటూ వాదించి నువ్వు దూరమే వెట్ట
ప్రేమ ముందు కోపమే గెలువలేదే

పంతానికే ఒక రాముడు సీత ప్రేమనే కోరుకున్నాడు
నీకు సీతను గాకపోయినా ఈ జన్మకు రామయ్య నువ్వేగా

సీతమ్మనే రాముడే బాధ పెట్టిన
రామయ్య పై ప్రేమ సచ్చిపోలేదే
వద్దంటూ వాదించి నువ్వు దూరమే వెట్ట
ప్రేమ ముందు కోపమే గెలువలేదే

ఓ గుండె నిండ నువ్వే
కొండంత బాధను మోస్తున్నావో ఎందుకు
కాలమే రాసింది కన్నీళ్లతో రాత మరిసిపోవెందుకు

వేడుకుందునా ఏడుకొండల సామీ తప్పు ఏమి జేస్తిరో
నెర్రవాసి నాది నిలువెల్ల నా ప్రేమ నేను ఎడపోదునో
వేడుకుందునా ఏడుకొండల సామీ తప్పు ఏమి జేస్తిరో
నెర్రవాసి నాది నిలువెల్ల నా ప్రేమ నేను ఎడపోదునో

కోరుకున్నోడే కళ్ళ ముందు సల్లగుంటే సాలనుకుంటిని
వాడు తల్లడిల్లి నేల కూలుతుంటే ఏమి చేయలేకపోతిని

నేను ప్రేమించినోడే బాధల్లో ఉంటే
సూడలేక నేను సొమ్మసిల్తిని
నా తోడు లేకున్నా ఎవలితో వాడున్న
నవ్వుతూ ఉంటె సాలనుకుంటిని

మనసు చంపుకుంది నేనైనా
వాడి బతుకు కోరుకున్న దానిలా
నేను పెంచుకున్న పేమ దాసిలా
వాడి ప్రేమ కోసం నేను మురిసినా

వేడుకుందునా ఏడుకొండల సామీ ఏమి రాత రాస్తివో
కలిసి ఉండలేని బంధలనే చేసి బాధపెట్టుతున్నావో
వేడుకుందునా ఏడుకొండల సామీ ఏమి రాత రాస్తివో
కలిసి ఉండలేని బంధలనే చేసి బాధపెట్టుతున్నావో
బాధపెట్టుతున్నావో

ఏ పూట నువ్వే గురుతే వస్తే
గుండెపై గుద్దిన వద్దే అని
నిన్నే పెళ్లి జేసుకోవాలని
కలలెన్నో గన్నా నే పిచ్చిదాన్ని

నా చేతులతో చేసుకున్నారా
నీ తప్పేమి ఇందులో లేదురా
నీకు దూరమైదమనుకున్నారా
నీ మేలు నే కోరుకున్నారా
ప్రాణంగా నిన్ను ప్రేమించినా
వేయలేదురా విడిపోయే అంచనా
నీకు చెప్పాలని నాకు లేదురా
కానీ మనసు మాట ఇంటలేదురా

వేడుకుందురా ఏడుకొండల సామీ ఇంతటి ప్రేమేందిరో
కంటి పాపలాగా నిన్ను చూసుకుంటా కంటనీరు ఎందుకో
వేడుకుందురా ఏడుకొండల సామీ ఇంతటి ప్రేమేందిరో
కంటి పాపలాగా నిన్ను చూసుకుంటా కంటనీరు ఎందుకో
కంటనీరు ఎందుకో

_______

నిర్మాత: నివృత్తి వైబ్స్ (Nivriti Vibes)
సాహిత్యం: దిలీప్ దేవగన్ (Dilip Devgan)
గాయకులు: దివ్య మాలిక (Divya Malika), దిలీప్ దేవగన్ (Dilip Devgan)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
నటీనటులు: అక్షిత్ (Akshith), రీను ఎస్కే (Reenu SK), సిరి రావులా చారి (Siri Ravula Chary)
దర్శకుడు: మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)

yededu lokalu yeleti ramudu song lyrics, yededu lokalu yeleti ramudu song lyrics part 2

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.