మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
దేవుళ్ళు దేవతలు కొలువై లేరు కొవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక
లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా
ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు
నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి
కలిసిన మనసె సాక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
In English Version:
Marumalli jaabilli okatayite maa chelli
Manmadhuni Raaghavuni kalabothe baava ani
Marumalli jaabilli okatayite maa chelli
Manmadhuni Raaghavuni kalabothe baava ani
Iddarokatayye pelli eedu jodu pelli
Intiperu marche pelli jantanadaka pelli
Brahmaandanga Brahmotsavamai jarugutunna pelli
Bahumaananga aasheesulane adugutunna pelli
Marumalli jaabilli okatayite maa chelli
Manmadhuni Raaghavuni kalabothe baava ani
Iddarokatayye pelli eedu jodu pelli
Intiperu marche pelli jantanadaka pelli
Devullu devatalu koluvai leru kovelalo
Bandhuvulai chuttalai vichchesinaaru vaakililo
Ooru vaadaa vedukaa prati okkari hrudayam vedika
Lene ledu teerikaa prati nimisham teliyani tikamaka
Mainaalu koyilalu koorcholedu kommalalo
Maa vaallai ayinollai oka cheyyesinaayi melamlo
Pandirilona pandugulanni niluputhunna pelli
Navvulalona kannula tadini kaluputhunna pelli
Marumalli jaabilli okatayite maa chelli
Manmadhuni Raaghavuni kalabothe baava ani
Iddarokatayye pelli eedu jodu pelli
Intiperu marche pelli jantanadaka pelli
Maa naannaa maa anna iddaru naaku puttillu
Andariki selavantu ne velli vasta atthillu
Challani choope kaatuka ika taragani preme bottuga
Mamakaarale siruluga mettinlo untaa Seetaga
Atraannayi sootranayi muddugaa vestaa bandhaalu
Nestaanayi nee vaadnai nee vadda vuntaa vandellu
Maatalu kalise manasulu kalise muchchataina pelli
Kalisina manase saakshigaa niliche swachchamayina pelli
Marumalli jaabilli okatayite maa chelli
Marumalli jaabilli okatayite maa chelli
Manmadhuni Raaghavuni kalabothe baava ani
Iddarokatayye pelli eedu jodu pelli
Intiperu marche pelli jantanadaka pelli
Iddarokatayye pelli eedu jodu pelli
Intiperu marche pelli jantanadaka pelli
_______________
Song Credits:
పాట: మరుమల్లి జాబిల్లి (Marumalli Jabilli)
చిత్రం: లక్ష్మీ నరసింహ (Lakshmi Narasimha)
నటీనటులు: ఆసిన్ (Aasin), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), మురళీధర్ (Muralidhar), శ్రీవర్తిని (Srivarthini)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
