Sivangivey song lyrics Whistle

సివంగివే (Sivangivey) సాంగ్ లిరిక్స్, Whistle | Thalapathy Vijay

by Lakshmi Guradasi

మానినీ…మానినీ…
అడుగులే ఝళిపించు పిడుగులై ఒళ్ళు విరుచుకో
వినువీధి దారిన మెరుపులా..
భూమినే బంతాడు కాలమే
మీదే ఇకపై లోకం వీక్షించెనిక మగువల వీరంగం..

ఓఓ..ఓ.ఓ..
సివంగివే.. సివంగివే.. తలవంచే మగజాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ..కానీ కానీ
నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై ఏరి పారేయ్ తీరాలన్ని
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకు బాటవేయి !!
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి !!

సివంగివే నువ్వే… సివంగివే సివంగివే…
తలవంచే మగజాతి నీకే…
నీ త్యాగమే గుర్తించగా… సాహో అంటూ మోకరిల్లదా
ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే… మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి…
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి..

నువ్వీపని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మొద్దు
నీపైనే జాలిచూపే గుంపే నీకు అసలొద్దు
ఊరే నిను వేరే చేసి వెలివేస్తున్నా ఆగొద్దు
నీలోని విద్వత్తేంటో చూపెయ్యాలి యావత్తు

లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే
ప్రసవాన్ని చేధించి సాధించే అగ్గి మొగ్గవే
కదలి రా.. భువిని యేలగా
యెగసి రా.. అగ్గి మొగ్గవే..కదలి రా.
నీ సరదా కలల్ని కందాం రా
ఏ పరదాలైనా తీద్దాం రా

ఏరై పారే తీరై… ఏరి పారేయ్ తీరాలన్ని
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే… మూయించాలిక
కోరే భవితకు బాటవెయ్యి…
జారే జారే ధారే కంట… మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక… శక్తి నీవని
చాటి భయముకి బదులునీయి..

ఎదే గాయాలు దాటే సమయం ఇదే
నీ బాధే మారే గాథలా
నీ భారం నీవే మోయాలమ్మా
విజయాల ఆశయమే…
తరుణోదయమై కాంతి నిండగా
తరుణోదయమై కాంతి నిండగా..

సివంగివే.. సివంగివే.. తలవంచే మగజాతి నీకే
నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా
రారా రాణీ..కానీ కానీ
నీ హాసం లాసం వేషం రోషం గర్వించేలా దేశమే
ఏరై పారే తీరై ఏరి పారేయ్ తీరాలన్ని
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక
కోరే భవితకు బాటవేయి !!
జారే జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట
అబలంటే ఊరుకోక శక్తి నీవని
నీ భయముకి, నీ భయముకి… నీ భయముకి బదులునీయి !!

________________

సినిమా – విజిల్ (Whistle)
పాట – సివంగివే (Sivangivey)
గాయకులు – A.R. రెహమాన్ (A.R. Rahman), షాషా తిరుపతి (Shashaa Tirupati), శరత్ సంతోష్ (Sarath Santhosh)
సాహిత్యం – రాకేందు మౌళి (Rakendu Mouli)
సంగీతం – ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
నటీనటులు – విజయ్ (Vijay), నయనతార (Nayanthara,),
దర్శకత్వం: అట్లీ (Atlee)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like