Naa Pere Yellamma song lyrics Naga durga

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో Song lyrics | Naga Durga

by Lakshmi Guradasi

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో…
అందరి ముంగాట నే అమ్మవారునే…
కలియుగములోన కన్నే మాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటి నాకు ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే….
నీ ఇంటి ముంగాట నే సుట్టామైతినే…
ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే…
న్నను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే….
అయ్యొ కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే….
నన్ను అడిగినోళ్లకు ఆడ బిడ్డలిద్దునే…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

అ మర్రి సెట్లల్లా నే మావురాలినే…..
ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే…
సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే….
ఆ గట్టు మీదున్న…గౌండ్లాడి బిడ్డనే……
ఆ మంద్దొడ్డ కు నేను మారెమ్మ తల్లినే…..
ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే……
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

తీరొక్క పేరు నాది తీరు బండారు…
తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు…
అయ్యో ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు…..
అడ్డెడు బియ్యమ్ము నా ముంగట పోద్దురు…..
నా యాపరెల్లాలనే నాకు తోరణమిద్దురు..
ఆ యటా పిల్లలనే నాకు కనుకగిద్దురు…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే…..
ఆ సీరే బట్టలనే నాకు సరే పోద్దురే…..
నా అక్క సెల్లెల్లె నాకు పాటలు పాడుదురే….
నా అకిట్ల అలికి….బోట్ల పట్నాలేద్దురే…..
అమ్మ శరణు శరణంటూ మాట సగాదిద్దురే…
తల్లి శరణాలే అంటూ…నన్ను ఆరాదిద్దు రే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

___________________

పాట: నా పేరే ఎల్లమ్మ (Naa Pere Yellamma)
నిర్మాత: దారుగుపల్లి ప్రభాకర్ (Dargupally Prabhakar)
సాహిత్యం – రాజేందర్ కొండా (Rajender Konda)
గాయకుడు – ప్రభ (Prabha)
సంగీతం – మదీన్ SK (Madeen SK)
కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ (Shekar Virus)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like