Home » రాక్ సాల్ట్ – ఆరోగ్యం

రాక్ సాల్ట్ – ఆరోగ్యం

by Vinod G
0 comments

ఆహారం ఎంత చక్కగా తయారు చేసిన అందులో సరిపడినంత ఉప్పు లేకపోతే దానికి రుచి ఉండదు, తినడానికి ఆసక్తి చూపించము. అయితే ఉప్పును మితంగానే వాడాలి. ఆహార పదార్థాల్లో దీని పరిమాణం పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు. ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. చాలా మంది ఎక్కువగా సముద్రపు ఉప్పు, అయొడైజ్డ్ సాల్ట్ వాడుతారు.

అయితే వీటిలాగే రాక్ సాల్ట్ కూడా ఒకటి ఉంటుందని మీకు తెలుసా. అధికంగా వాడే ఉప్పుతో పోల్చితే రాక్ సాల్ట్ లో సోడియం తక్కువగా ఉంటుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లవణాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారితో పాటు ఇతరులకు కూడా సాధారణకు ఉప్పు స్థానంలో రాక్ సాల్ట్ చక్కని ప్రత్యన్యంగా ఉపయోగించుకోవచ్చు.

రాక్ సాల్ట్ లో తక్కువ రసాయనాలు ఉంటాయి. కాబట్టి తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు రాక్ సాల్ట్ ఉపయోగించడం మంచిది. ఏదైనా ఉప్పుని మితంగా వాడడం మంచిది. కాబట్టి దీన్ని కూడా మితంగా వాడడం మంచిది.

రాక్ సాల్ట్ అంటే ఏమిటి ?

రాక్ సాల్ట్, దీన్ని హాలైట్ అని కూడా పిలుస్తారు, ఇది సాధారణంగా టేబుల్ సాల్ట్‌లో వుండే అదే రసాయన సమ్మేళనం అయిన సోడియం క్లోరైడ్ (NaCl)తో కూడిన ఒక రకమైన ఉప్పు. దీనిని “రాక్” ఉప్పు అని పిలుస్తారు, ఎందుకంటే ఇది భూమి లోపల పెద్ద, ఘన నిర్మాణాలను తవ్వి వివిధ ఉపయోగాల కోసం ప్రాసెస్ చేసి ఉపయోగిస్తారు.

అలాగే కొన్ని సందర్భాలలో ఇది ఉప్పు గనుల వంటి సహజ నిర్మాణాలలో లేదా ఉప్పు సరస్సులలో ఆవిరైన నిక్షేపాలలో కూడా కనుగొనవచ్చు. రాక్ సాల్ట్‌ను సాధారణంగా శీతాకాలంలో రోడ్లు మరియు కాలిబాటలను తొలగించడానికి ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది నీటి గడ్డకట్టే స్థానాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది మరియు మంచును కరిగిస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment