Home » ఏముంది రా (Emundi Ra) సాంగ్ లిరిక్స్, Krishna Vrinda Vihari

ఏముంది రా (Emundi Ra) సాంగ్ లిరిక్స్, Krishna Vrinda Vihari

by Lakshmi Guradasi
3.2K views
Emundi ra song lyrics krishna vrinda vihari

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు
అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పూవల్లే
తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా
తనందాన్ని కళ్ళకద్దరా

చెదురుగా ఉన్న నా చేతి రేఖలే
కలిపితే ఆమె రూపు రేఖలా
కురులలో చిక్కుకున్నాయి చూపులే
పైటలే దారి చెప్పవే హలా

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు
అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పూవల్లే
తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా
తనందాన్ని కళ్ళకద్దరా

అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్న
నిను పూజించి పిలిచారంటే
యుద్ధమైన ప్రకటించేయనా

ఏ కవులు పాడని
ఏ కథలు రాయని
అందాన్నే చూస్తున్నా
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా

జిలుగులే చల్లే ఆ పాలపుంతని
పెదవిపై పోసి నవ్వకే అలా
కాలలలో మోయలేనంత హాయిని
కనులలో దాచి వెళ్లకే అలా హలా

_____________

పాట: ఏముంది రా (Emundi Ra)
చిత్రం: కృష్ణ బృందా విహారి (Krishna Vrinda Vihari)
నటీనటులు: నాగ శౌర్య (Naga Shaurya), షిర్లీ సెటియా (Shirley Setia)
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar)
లిరిసిస్ట్: శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
గాయకులు: హరిచరణ్ (Haricharan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.