Home » నిజంగా నేనే – కొత్త బంగారు లోకం

నిజంగా నేనే – కొత్త బంగారు లోకం

by Shalini D
0 comments
nijanga nene song lyrics kotha bangaru lokam

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగుల లోన అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్న
అలసట రాదు గడచినా కాలం
ఇంతని నమ్మనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె
నా గాథలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటె

పెదవికి చెంప తగిలిన చోట
పరవాసమేదో తోడవుతుంటే
పగలే ఐన గగనం లోన తారలు చేరెనుగా

నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్న
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

హరే హరే హరే హరే హరే రామ
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నదే లోన ఎమ్మా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.