Home » నా కొడుకా (Naa Koduka) సాంగ్ లిరిక్స్ కుబేర (Kuberaa)

నా కొడుకా (Naa Koduka) సాంగ్ లిరిక్స్ కుబేర (Kuberaa)

by Lakshmi Guradasi
21.8K views
Naa Koduka song lyrics Kubera

పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా..

కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా..

పదిలంగా నువ్వు నడవలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకా..

ఆకలితో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా..

నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా..

మనుషికీ మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా..

తిడితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా..

రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకా..

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా..

పాణము నీది పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగారా నా కొడుకా..

ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఏదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దివేనిది నా కొడుకా..

ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దివేనిది నా కొడుకా..

ఏ పిడుగుల చప్పుడు వినపడినా
ఏ బూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేం చెయ్యదులేరా
అమ్మ దివేనిది నా కొడుకా..
అమ్మ దివేనిది నా కొడుకా..

Song Details:

సినిమా పేరు: కుబేర (Kuberaa)
పాట పేరు: నా కొడుకా (Naa Koduka)
గాయకుడు: సిందూరి విశాల్ (Sinduri Vishal)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం: నంద కిషోర్ (Nanda Kishore)
నటీనటులు – ‘కింగ్’ నాగార్జున అక్కినేని (‘King’ Nagarjuna Akkineni), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna),
దర్శకుడు – శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
నిర్మాతలు – సునీల్ నారంగ్ (Suniel Narang), పుస్కూర్ రామ్ మోహన్ రావు (Puskur Ram Mohan Rao)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.