Home » రామచంద్రుడే (Ramachandhrude) సాంగ్ లిరిక్స్, Oh Bhama Ayyo Rama

రామచంద్రుడే (Ramachandhrude) సాంగ్ లిరిక్స్, Oh Bhama Ayyo Rama

by Lakshmi Guradasi
0 comments
Ramachandhrude song lyrics Oh Bhama Ayyo Rama

రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి
అది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి

వేదాల మంత్రాల పెళ్లి తంతులో
చూసారా ఆనందం కొత్త జంటలో
వధువరులు విడి విడి కథలు ఒకటయ్యే ఘట్టము
ఇరువరము ఇక చెరిసగము అని కట్టాలి సూత్రము

నీ వాళ్ళు నా వాళ్ళు అయ్యారే మన వాళ్ళు
నీదంటూ నాదంటూ లేవే యే భేదాలు
మధురం కన్నా మధురము అయిన వధువుని తాకే మునివేళ్ళు
చిరుతడి తగిలి అన్నాయంట అనలేనెన్నో సంగతులు

కన్నుల ఎరుపే కనిపిస్తుంటే ఎదలో గుబులే వినిపిస్తుందే
తమరికి తోడు నేనున్నాను ఇసుమంత కష్టం రానివ్వలేను
పిల్ల పిల్ల మన ఇద్దరి బంధం
పిల్ల పిల్ల ఓ శతమానం

అ మాట వింటు లోలో ఎంతో సంబరపడుతున్నా
కోటి ఆశలతో నీవెంటే నే నడిచొస్తా కన్నా

రామచంద్రుడే లోక రక్షయని చాటినట్టి పెళ్లి
బలరామచంద్రుడే పెళ్లి పెద్దగా జరిపినట్టి పెళ్లి
అది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్లి
అలరారుతున్న ఈ పెళ్లి మండపం చూడనుంది మళ్ళీ
సుముహూర్తంతో చూపులు కలిసే చిత్రమైన పెళ్లి
మాంగల్యంతో ముడిపడనుంది ముచ్చటైన పెళ్లి

ఒడిదుడుకైన ఎడబాటైన కలిసేగా మన ప్రయాణం
ఒక్కరికి ఒకరం ఒక్కరికై ఒకరం బ్రతికే తీరునే పెళ్ళంటా

_____________

సినిమా పేరు: ఓ భామా అయ్యో రామా (Oh Bhama Ayyo Rama)
పాట పేరు: రామచంద్రుడే (Ramachandhrude)
గీత రచయితలు : శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani) (Lyrics )
పార్ధు సన్నిధిరాజు (Pardhu sannidhiraju) (Saaki)
గాయకులు: టిప్పు (Tipu) & హరిణి టిప్పు (Harini Tipu)
సంగీత దర్శకుడు: రాధన్ (Radhan)
నటీనటులు : సుహాస్ (Suhas) , మాళవిక మనోజ్ (Malavika Manoj),
రచయిత, దర్శకుడు: రామ్ గోధలా (Ram Godhala)
నిర్మాతలు: హరీష్ నల్లా (Harish Nalla)

See Also from this Movie: Oh Bhama Ayyo Rama Title Song Lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.